news

News February 8, 2025

ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారు రేవంత్ రెడ్డీ?: హరీశ్ రావు

image

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.

News February 8, 2025

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు?

image

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

News February 8, 2025

Round 6: ఢిల్లీలో 300 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్

image

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ వెనుకంజ వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కన్నా 300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

News February 8, 2025

PHOTO: రోజా కూతురు ర్యాంప్ వాక్

image

AP: మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతున్నారు. వెబ్‌ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ’గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌’లో ఆమె ర్యాంప్‌‌పై నడిచి ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో అన్షు షేర్ చేశారు. ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ అవార్డు సైతం అందుకున్నారు.

News February 8, 2025

ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్

image

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్‌కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

News February 8, 2025

17 సీట్లలో BJP, AAP మధ్య తేడా 1000 ఓట్లే

image

ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.

News February 8, 2025

EC డేటా: BJP 40, AAP 30

image

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.

News February 8, 2025

Delhi Results: ఇండీ కూటమిపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

image

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను షేర్ చేశారు. ‘జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది. ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శించారు.

News February 8, 2025

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే

image

ఢిల్లీలోని ముస్లిం ఆధిపత్య 7 నియోజకవర్గాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శించడానికి ఆ పార్టీ ముస్లిం మోర్చా ‘సైలెంట్ క్యాంపెయిన్’ బాగా హెల్ప్ చేసింది. వీరు 4-7 సభ్యుల బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటికీ తిరిగారు. ‘లాభార్థి యోజనా’ ఫామ్స్ పేరుతో వివరాలు సేకరిస్తూ ఆప్‌పై ఆగ్రహాన్ని గమనించారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో 70-80 చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి తమకు అవకాశం ఇవ్వాలని కోరడం కలిసొచ్చినట్టు తెలుస్తోంది.

News February 8, 2025

BJPకి షాక్: మెజార్టీ నంబర్ వైపు AAP

image

ఢిల్లీలో ఓట్ల లెక్కింపు సాగే కొద్దీ పార్టీల ఆధిక్యాలు మారుతున్నాయి. అరగంట క్రితం 50 స్థానాల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం 41కి తగ్గిపోయింది. ఇక ఆమ్‌ఆద్మీ పార్టీ 18 నుంచి 28కి పుంజుకుంది. చాలాచోట్ల అభ్యర్థుల ఆధిక్యాలు 500 నుంచి 1000 మధ్యే ఉంటున్నాయి. దీంతో ప్రతి రౌండ్ ముగిసే సరికి నంబర్లు అటూ ఇటూ మారుతున్నాయి. మెజారిటీని నిర్ణయించడంలో ముస్లిం ఆధిపత్య నియోజకవర్గాలు కీలకం కానున్నాయి.