news

News February 8, 2025

అనూహ్యం.. ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

image

ఢిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్ ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. దీంతో ఆప్, కాంగ్రె‌స్‌‌ని కూడా ముస్లింలు ఆదరించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News February 8, 2025

కాంగ్రెస్ దుస్థితి: జీరో, జీరో.. మరో జీరో లోడింగ్!

image

ఢిల్లీ అసెంబ్లీకి 1952-2020 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4సార్లు గెలిచింది. అలాంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతోంది. 2015, 2020 ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఈసారీ పేలవ ప్రదర్శన చేస్తోంది. కేవలం ఒకేఒక్కచోట స్వల్ప ఆధిక్యతతో ఊగిసలాడుతోంది. పూర్తి కౌంటింగ్ ముగిసే సమయానికి ఆ స్థానమూ డౌటేనని అంచనా. దీంతో హ్యాట్రిక్ డకౌట్ ఖాయంగా కనిపిస్తోంది.

News February 8, 2025

27 ఏళ్ల బీజేపీ కరవు తీర్చిన ₹12L ట్యాక్స్ మినహాయింపు!

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం గెలుపు దాదాపు ఖాయమేనని విశ్లేషకుల అంచనా. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మిడిల్ క్లాస్‌ను బీజేపీ వైపు తిప్పిందని పేర్కొంటున్నారు. అలాగే పదేళ్ల ఆప్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు.

News February 8, 2025

అలాంటి ఇంటి పట్టాల రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: YCP హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా? తదితర వివరాలు సేకరించాలని పేర్కొంది. కాగా జగన్ ప్రభుత్వంలో 22.80L మందికి ఇంటిస్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71L మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7L మందిలోనే అనర్హులు ఉన్నట్లు సమాచారం.

News February 8, 2025

ఆప్‌కు కాంగ్రెస్ ‘ఓట్ షేరింగ్’ దెబ్బ

image

ఢిల్లీ ఎన్నికలు ఫలితాలు ఆప్‌కు అధికారాన్ని దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లను కాంగ్రెస్ పార్టీ దారుణంగా చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఆప్ ప్రస్తుతం 15% ఓట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4.26 % ఓట్లు రాగా, ప్రస్తుతం 17% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆప్‌కు దక్కాల్సిన మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది.

News February 8, 2025

ఆప్‌కు బిగ్ షాక్

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్‌, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.

News February 8, 2025

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ

image

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

News February 8, 2025

ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. లీడింగ్‌లో ఆ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 38 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ 25 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.

News February 8, 2025

ముస్లింల ప్రాంతంలో ఆప్ ముందంజ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆప్ ఆధిపత్యం కనబరుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని 10 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. దీంతో ముస్లిం ప్రాంతాలల్లో ఆప్ పట్టు నిలుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్‌గా బీజేపీ 30 చోట్ల, ఆప్ 24 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక చోట లీడింగ్‌లో ఉంది.

News February 8, 2025

1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?

image

1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.