India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మన్ పౌరుడేనని కోర్టు తేల్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.30లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5లక్షలు చెల్లించాలని పేర్కొంది.
మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇవాళ బయటకు వచ్చింది.
TG: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన సాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు. ఆమె విగ్రహాన్ని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2009లో సరిగ్గా ఇదే రోజు కేంద్రం నుంచి తొలి ప్రకటన వెలువడింది. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత ఈ ప్రకటన రావడంతో బీఆర్ఎస్ ఈరోజును ఏటా ‘దీక్షా విజయ్ దివస్’గా నిర్వహిస్తోంది. ప్రజల పోరాటాన్ని చూసి చలించి ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 2013 OCT3న కేంద్ర క్యాబినెట్ TG స్టేట్ ఏర్పాటుకు ఆమోదం తెలపగా, 2014 జూన్ 2న రాష్ట్రం అవతరించింది.
పదేళ్లలో కేరళలో పాగా వేయడానికి BJP ఒక స్ట్రాటజీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందువులు 54, ముస్లిములు 27, క్రైస్తవులు 18% ఉన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలవుతూ LDFను వీడుతున్న హిందూ, క్రైస్తవులను BJP చేరదీస్తోంది. క్రైస్తవ మత పెద్దలతో సమావేశమవుతూ మద్దతు సంపాదిస్తోంది. తాజాగా జార్జ్ జాకబ్ కూవకడ్ కార్డినల్ వేడుకకు ఓ బృందాన్ని వాటికన్‌కు పంపించింది.
AP: నంద్యాల(D)లో ఇంటర్ విద్యార్థిని <<14828564>>హతమార్చిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని వెల్దుర్తి(M) కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న దుర్మార్గుడు ఇవాళ తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న బాలిక నోట్లో దుస్తులు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడే మృతి చెందింది. అతడు కూడా నిప్పటించుకోగా, పరిస్థితి విషమంగా ఉంది.
AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఇంటర్ బాలిక ఆడ బిడ్డను ప్రసవించింది. సహచరులు భయంతో నాలుగో అంతస్తు నుంచి ముళ్ల పొదల్లోకి శిశువును విసిరేయడంతో చనిపోయింది. ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలికను ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంలో నిర్వాహకుల ప్రమేయం ఉందా? అని ఆరా తీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో యాదాద్రి(D) రాజాపేట(M) బేగంపేటలో తొలిసారిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమ కారుడు సుదగాని వెంకటేశ్ ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని 2007 జనవరి 25న అప్పటి తల్లి తెలంగాణ పార్టీ చీఫ్ విజయశాంతి ఆవిష్కరించారు. ఆ విగ్రహం కిరీటం లేకుండా సాధారణ స్త్రీ రూపంలో ఉండేది. ఆ విగ్రహానికి ప్రస్తుత ప్రభుత్వం ఆవిష్కరించనున్న <<14807682>>విగ్రహానికి<<>> పోలికలు ఉన్నాయని పలువురు అంటున్నారు.
INDIA కూటమి మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. EVMలపై డౌట్లు, ప్రజలు మహాయుతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదంటూ తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారాన్ని MVA బహిష్కరించడం తెలిసిందే. ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపించిన కాంగ్రెస్, శివసేన UBT ఎమ్మెల్యేలు రెండోరోజు ప్రమాణం చేయడం విచిత్రంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఒక్కరోజులోనే ఏం మారిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.
TG: CM రేవంత్ తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ఆవిష్కరించడం దురదృష్టకరం అని MLC కవిత అన్నారు. ఈ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని విమర్శించారు. ‘తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలనుకుంటే గన్ పార్క్ దగ్గర రేవంత్ ముక్కు నేలకు రాయాలి. ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ఆయనకు లేదు’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.