news

News February 5, 2025

ట్రంప్ నిర్ణయాలు.. ఆ ఆలయాలకు పెరిగిన భక్తులు!

image

US వీసా నిబంధనల్ని ట్రంప్ సర్కారు మరింత కఠినతరం చేస్తుండటంతో భారతవ్యాప్తంగా ఉన్న ‘వీసా’ దేవుళ్లకు భక్తుల తాకిడి పెరిగింది. ట్రంప్ వచ్చాక TGలోని చిలుకూరు బాలాజీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వీసా హనుమాన్, పంజాబ్‌లోని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా, ఢిల్లీలోని శ్రీ సిద్ధిపీఠ్ చమత్కారీ హనుమాన్, చెన్నైలోని శ్రీలక్ష్మీ వీసా గణపతి ఆలయాలకు రద్దీ భారీగా పెరిగిందని ఆయా ఆలయాల అధికారులు చెబుతున్నారు.

News February 5, 2025

నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప-2 హవా

image

థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 సినిమా ఓటీటీలోనూ దుమారం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 4రోజుల్లోనే 5.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 7 దేశాల్లో వ్యూయర్‌షిప్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషేతర కేటగిరీల్లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ రూ.1850 కోట్లపై చిలుకు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

News February 5, 2025

నాటు-నాటు ఫోజులో ‘NTR’ పోస్టర్ షేర్ చేసిన ‘ఫిఫా వరల్డ్ కప్’

image

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు నేమార్, టెవెజ్, రొనాల్డో బర్త్ డే కావడంతో ‘ఫిఫా వరల్డ్’ కప్ ఇంట్రెస్టింగ్‌గా విష్ చేసింది. ఈ ముగ్గురూ ‘RRR’ సినిమాలోని నాటునాటు స్టెప్‌ వేసినట్లు పోస్టర్‌పై NTR అని ఉంచి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, RRR టీమ్ సైతం స్పందిస్తూ వారికి విషెస్ తెలియజేశారు.

News February 5, 2025

రక్షణ మంత్రితో ముగిసిన లోకేశ్ భేటీ.. వాటికోసం విజ్ఞప్తి

image

AP: ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో NDA సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించిన లోకేశ్, రక్షణ రంగానికి సంబంధించిన పలు పెట్టుబడుల్ని APలో పెట్టాలని కోరారు. డిఫెన్స్ క్లస్టర్, రక్షణ రంగ పరికరాల తయారీలో కొన్ని యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయనకు రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు.

News February 5, 2025

రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!

image

TG: ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి KTR బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

News February 5, 2025

విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు

image

APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.

News February 5, 2025

JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్

image

ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.

News February 5, 2025

ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్‌పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నాయి.

News February 5, 2025

దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!

image

TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 5, 2025

అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు

image

TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.