India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.
TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు జోరుమీదున్నాయి. రూ.1007 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 15 నెలల రెసిస్టెన్సీని బ్రేక్ చేశాయి. జపాన్ కంపెనీ PayPayలో రూ.2364 కోట్ల విలువైన వాటాను సాఫ్ట్‌బ్యాంకుకు విక్రయించేందుకు అనుమతి లభించిందని పేటీఎం చెప్పడమే ఇందుకు కారణం. చైనా నుంచి పెట్టుబడులు రావడం, పేమెంట్ బ్యాంకు కష్టాలు తొలగిపోవడంతో కంపెనీ షేర్లు 6 నెలల్లోనే 183% రాబడి అందించాయి.
INDIA కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యంపై చర్చ తీవ్రమవుతోంది. కూటమి నేతల మాటలూ, చేతలూ పరోక్షంగా ఇవే సంకేతాలను పంపిస్తున్నాయి. ‘వాళ్లకు చేతకాకుంటే నేనే నడిపిస్తా’ అని మమతా బెనర్జీ అన్నారు. మహారాష్ట్ర Sr పొలిటీషియన్ శరద్ పవార్ సైతం ఆమె సమర్థురాలని చెప్పి RGకి పరోక్షంగా పంచ్ ఇచ్చారు. మహారాష్ట్రలో MVA నుంచి విడిపోయిన SP.. TMCతో కలిసి అదానీ అంశంపై పార్లమెంటులో INDIA MPల నిరసనలో పాల్గొనలేదు. COMMENT
హైతీ దేశంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మోనెల్ మికానో అనే గ్యాంగ్ లీడర్ కుమారుడికి చేతబడి చేశారనే అనుమానంతో ముఠా సభ్యులు మురికివాడపై దాడిచేశారు. రెండు రోజులు నరమేధం సృష్టించారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులను కత్తులతో విచక్షణారహితంగా నరికేశారు. ఈ ఘటనలో 110 మంది మరణించినట్లు నేషనల్ హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్‌వర్క్ వెల్లడించింది.
AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్‌లో PDF అభ్యర్థి గోపీ మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలిచారు. గోపీ మూర్తికి 8వేలకు పైగా ఓట్లు లభించాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. 15,490 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదుగురు అభ్యర్థులు గోపీమూర్తి, నారాయణరావు, దీపక్, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీ పడ్డారు.
రైల్వే ప్రయాణికులు IRCTCలో టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్విటర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈక్రమంలో దీనిపై IRCTC ప్రకటన విడుదల చేసింది. నిర్వహణ కార్యకలాపాల కారణంగా ఈ-టికెటింగ్ సేవలు గంట సేపటి వరకు అందుబాటులో ఉండవని, తర్వాత ప్రయత్నించాలని పేర్కొంది. ఏవైనా సమస్యలుంటే 14646, 0755-6610661 లేదా 0755-4090600కు కాల్ చేయాలని సూచించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘RRR’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో యాంగిల్‌ను చూడబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దర్శకధీరుడు రాజమౌళిపై ‘RRR: Behind & Beyond’ పేరుతో డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ కానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే విడుదలవుతుందని తెలిపారు.
సీజన్‌ను బట్టి పక్షులు వేల కిలోమీటర్లు వలస వెళ్తుంటాయి. దీనిపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు చేసింది. చియులువాన్2 అనే మగ గద్ద మణిపుర్ నుంచి కెన్యా, టాంజానియా, మలావి, జాంబియా గుండా సోమాలియాకు చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని ఉపగ్రహం ద్వారా గుర్తించారు. 3వేల కిలోమీటర్లను 5 రోజుల 17 గంటల్లో చేరుకుంది. గ్వాంగ్‌రామ్ అనే ఆడ గద్ద కూడా నాన్‌స్టాప్‌గా ప్రయాణించగలదని పరిశోధనలో తేలింది.
Sorry, no posts matched your criteria.