news

News August 7, 2024

జాతీయ విపత్తుగా ప్రకటించండి: రాహుల్ గాంధీ

image

కేరళలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషాదం మిగిల్చిన బాధ‌, నొప్పిని త‌న క‌ళ్లారా చూశార‌న్నారు. బాధితుల కోసం స‌మ‌గ్ర‌ పున‌రావాస ప్యాకేజీని ప్ర‌క‌టించాల‌ని బుధవారం లోక్ సభలో కేంద్రాన్ని కోరారు.

News August 7, 2024

సునీతా విలియమ్స్‌పై ఈరోజు అప్‌డేట్: నాసా

image

బోయింగ్ స్టార్‌లైనర్ విమానంలో ఇబ్బందుల కారణంగా బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్ ISSలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వెళ్లిన వారానికి వెనక్కి రావాల్సిన వీరు ఈ ఏడాది జూన్ 6 నుంచి అక్కడే ఉండిపోయారు. సునీత ఆరోగ్యం బాలేదంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నాసా ఈరోజు రాత్రి 10గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించనుంది. ఆమె పరిస్థితి సహా పూర్తి ప్రాజెక్ట్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు నాసా పేర్కొంది.

News August 7, 2024

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ప్రచారం.. స్పందించిన KTR

image

BRS త్వరలో BJPలో విలీనం అవుతుందనే వార్తలను KTR ఖండించారు. తెలంగాణ ప్రజలకు BRS సేవలందిస్తూనే ఉందని, ఇదిలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘తప్పుడు ఎజెండాలతో నిరాధారమైన రూమర్స్‌ను వ్యాప్తి చేసే వారికి ఇదే మా చివరి హెచ్చరిక. దీనిపై వెంటనే రిజాయిండర్‌ను ప్రచురించండి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని వార్నింగ్ ఇచ్చారు. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం అని ట్వీట్ చేశారు.

News August 7, 2024

ఫొగట్ నువ్వు మా దృష్టిలో ఛాంపియనే: PV సింధు

image

పారిస్ ఒలింపిక్స్‌లో పతాక బరిలో నిలిచిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై <<13796504>>అనర్హత<<>> వేటు పడటంపై బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్పందించారు. ‘ఫొగట్ నువ్వు మా దృష్టిలో ఛాంపియనే. స్వర్ణం గెలుస్తావని ఆశించాను. బెంగళూరులోని PDCSEలో నేను నీతో గడిపిన కొద్ది సమయంలో నీ పోరాట స్ఫూర్తిని గమనించాను. ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం. నీకు సపోర్ట్‌గా నేనున్నా’ అని ట్వీట్ చేశారు.

News August 7, 2024

రష్మిక గురించి మీకు ఈ విషయం తెలుసా?

image

హీరోయిన్ రష్మికకు ఓ చిన్ని చెల్లి ఉంది. ఆమె పేరు షిమన్ మందన్న. వారిద్దరి మధ్య వయసు తేడా 16 ఏళ్లు. రష్మిక ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ ‘ఏజ్ గ్యాప్ వల్ల నాకు, నా చెల్లికి గొడవలు ఉండవు. తనని తల్లిలా చూసుకుంటా. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయింది. అప్పటినుంచి తనతో 4 నెలలు మాత్రమే గడిపా. తను కూర్గ్(కర్ణాటక)లో ఉంటుంది. షూటింగ్స్ వల్ల కలవడం కుదరట్లేదు. వీడియో కాల్స్‌ చేస్తుంటా’ అని చెప్పారు.

News August 7, 2024

HATSOFF: అవయవ దాతలకు ఆ రాష్ట్రాల గౌరవం

image

తాను లేకపోయినా తన శరీరం పదిమందికి ఉపయోగపడాలనే ఆలోచన అత్యున్నతమైనది. అలాంటి ఉన్నత మార్గాన్ని ఎంచుకున్నవారికి దక్కే గౌరవం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. అందుకే తమిళనాడు, ఒడిశా ప్రభుత్వాలు అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు?

News August 7, 2024

SHOCKING: కూలబడిన వినేశ్ ఫొగట్

image

బరువు ఎక్కువగా ఉండటంతో వినేశ్ ఫొగట్ రాత్రంతా <<13797175>>వివిధ రకాలుగా బరువు <<>>తగ్గేందుకు యత్నించారు. ఆహారం, నీరు కూడా తీసుకోకపోవడంతో ఈరోజు ఉదయానికి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇంత చేసినా 100 గ్రాముల బరువు అధికంగానే ఉన్నారు. ఈక్రమంలో ఒంట్లో ఓపిక నశించి కూలబడిపోయారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫొటోలు చూసి చలించిపోతున్నారు.

News August 7, 2024

భారత్ బౌలింగ్.. కొత్త ప్లేయర్ ఎంట్రీ

image

INDతో జరిగే మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రియాన్ పరాగ్ అరంగేట్రం చేస్తున్నారు. కేఎల్ రాహుల్ స్థానంలో పంత్ వచ్చారు.
భారత్: రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, పంత్, రియాన్ పరాగ్, దూబే, సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్.
శ్రీలంక: నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, కమిందు మెండిస్, లియానగే, వెల్లలగే, తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.

News August 7, 2024

మళ్లీ పారిస్‌కు మనూ భాకర్.. ఎందుకంటే?

image

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇవాళ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు ఘనస్వాగతం లభించింది. కాగా ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. భారత ఫ్లాగ్ బేరర్‌గా మను వ్యవహరించనున్నారు. దీంతో ఈ నెల 9న ఆమె ఇక్కడి నుంచి ఫ్రాన్స్ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయాతో ఆమె భేటీ కానున్నారు.

News August 7, 2024

వినేశ్ అనర్హతపై పార్లమెంట్‌లో ఆందోళన

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో పార్లమెంట్‌లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఈ విషయంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో క్రీడాశాఖ మంత్రి ప్రకటన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇంతకుముందే వినేశ్ ఫొగట్‌పై కాంగ్రెస్ ఓ వీడియో విడుదల చేసింది. ‘అప్పుడు ఢిల్లీ వీధుల్లో పోరాడారు. ఇప్పుడు రెజ్లింగ్ మ్యాట్‌పై పోరాడుతున్నారు’ అంటూ ప్రశంసించింది.