news

News August 23, 2024

పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ గమనించాలి: పోలీసులు

image

TG: యుక్తవయసు పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. ‘డ్రగ్స్ మత్తుకు బానిసగా మారిన యువత కుటుంబంతో పాటు సమాజానికీ ప్రమాదకరం. డ్రగ్స్ నుంచి పిల్లల్ని కాపాడే బాధ్యత పోలీసులకు ఎంత ఉందో పేరెంట్స్‌కూ అంతే ఉంది’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 40వేల మంది డ్రగ్స్ బాధితులను టీన్యాబ్ గుర్తించిందని, వారిలో విద్యావంతులు, ఉన్నతోద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

News August 23, 2024

18 ఏళ్లు నిండే వారికి అలర్ట్

image

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 JAN 1 వరకు 18 ఏళ్లు నిండే వారు ఓటర్ల జాబితాలో పేరు <>నమోదు<<>> చేసుకోవచ్చు. OCT 10 వరకు BLOలు ఇంటింటి సర్వే, జాబితాలో ఫొటోల మార్పు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపడతారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న వారి వివరాలతో OCT 29న ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. NOV 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, DEC 24 నాటికి పరిష్కరించి JAN 6న తుది జాబితా ప్రకటిస్తారు.

News August 23, 2024

కేరళ సీఎస్‌గా భర్త తర్వాత భార్య

image

కేరళ అధికార యంత్రాంగంలో ఆసక్తికర ఘటన జరిగింది. అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) పదవి భార్యాభర్తలిద్దరిని వరిస్తోంది. ప్రస్తుత CS వేణు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన భార్య, స్థానిక స్వపరిపాలన శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ శారదా మురళీధరన్ CSగా బాధ్యతలు చేపట్టనున్నారు. IAS దంపతులు CSగా నియమితులు కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇద్దరూ 1990 IAS బ్యాచ్‌కు చెందిన వారే.

News August 23, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు

image

TG: పరువునష్టం కేసులో సెప్టెంబర్ 25న కోర్టుకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ రేవంత్ నిరాధార ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు CMకు సమన్లు ఇచ్చింది.

News August 23, 2024

స్టైలిష్ లుక్‌లో షమీ

image

టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. వన్డే ప్రపంచ కప్ తర్వాత కాలి మడమకు శస్త్ర చికిత్స జరగడంతో చాలా కాలం క్రికెట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో తన పేస్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు. గతంలో బట్టతలతో కనిపించిన ఆయన ప్రస్తుతం పూర్తిగా మారిపోయి స్టైలిష్‌గా తయారయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

News August 23, 2024

రెడ్ పాస్‌పోర్టు రద్దు.. హసీనాకు షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

image

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు అక్కడి మధ్యంతర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అవామీ లీగ్‌కు చెందిన మాజీ మంత్రులు, MPలు, వారి కుటుంబసభ్యుల దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ రెడ్ పాస్‌పోర్టు ద్వారా చాలా దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. దేశం విడిచి వెళ్లిపోయిన హసీనాను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. పాస్‌పోర్టు రద్దయితే ఆమె దౌత్యపరమైన వెసులుబాట్లను కోల్పోతారు.

News August 23, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/Quiz.jsp?id=338&langid=1&token={TOKEN}

News August 23, 2024

హత్యాచారానికి నిరసనగా వేశ్యల కీలక నిర్ణయం!

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం, దేశంలో అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో సోనాగాచికి చెందిన వేశ్యలు వినూత్నంగా నిరసన చేస్తున్నారు. దుర్గా విగ్రహాల తయారీకి తమ ఇళ్లలోని మట్టిని ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యభిచార గృహాల మట్టిని దుర్గామాత విగ్రహానికి ఉపయోగించడం అక్కడి సంప్రదాయం. తమ పనిని వృత్తిగా గుర్తించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నామని, అందుకే మట్టి ఇవ్వట్లేదని వారు చెబుతున్నారు.

News August 23, 2024

ఆ సర్వీస్ ఇక జొమాటోలో ఉండదు

image

10 పెద్ద న‌గ‌రాల నుంచి దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డికైనా స‌రే ఫుడ్ డెలివ‌రీ చేసే జొమాటో లెజెండ్స్ సర్వీస్‌ను ప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. రెండేళ్లపాటు దీనిపై పనిచేసినా ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో జొమాటో లెజెండ్స్‌ను మూసేస్తున్న‌ట్టు సంస్థ సీఈవో దీపింద‌ర్ గోయ‌ల్ తెలిపారు. ఐకానిక్ వంటకాల దేశవ్యాప్త డెలివరీ లక్ష్యంతో 2022లో జొమాటో దీన్ని ప్రారంభించింది.

News August 23, 2024

ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా

image

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగిన <<13921216>>ప్రమాద <<>>వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం పంపాలని సీఎం ఆదేశించారు.

error: Content is protected !!