India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హీరో ప్రభాస్‌నుద్దేశించి బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కల్కి 2898AD’ చిత్రంలో ఆయన గెటప్ ‘జోకర్’లాగా ఉందన్నారు. మరోవైపు అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మేకర్స్ ప్రభాస్ లుక్‌ను ఇలా ఎందుకు చేశారో తనకు అర్థం కావట్లేదన్నారు. కాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ శాఖల్లోని ఉన్నత స్థానాలను UPSC ద్వారా కాకుండా RSS ద్వారా భర్తీ చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యమైన పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. తద్వారా బ్యూరోక్రసీలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోతోందన్నారు.
జన్మనిచ్చిన మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవ్వడం తన హృదయాన్ని ముక్కలు చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. స్క్రీన్ల వెనకాల ఉండి దారుణమైన పోస్టులు చేస్తున్నవారిని గుర్తించి శిక్షించడంలో విఫలమయ్యామన్నారు. కోల్‌కతా ఘటనలో బాధితురాలిని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంస్కృతిని నార్మలైజ్ చేయకుండా జవాబుదారీగా నిలబడాలని కోరారు.
ఏపీలోని నెల్లూరులో మనీ స్కీమ్ పేరిట భారీ మోసం జరిగింది. పొదలకూరురోడ్డు ప్రాంతంలో విశ్వనాథ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏజెంట్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. చెన్నైలోని ఓ సంస్థ ద్వారా రూ.500 చెల్లిస్తే రూ.7లక్షలు, రూ.6,000 కడితే రూ.18లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించారు. దీంతో దాదాపు 10వేల మందికి పైగా నగదు చెల్లించి మోసపోయారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఆఫీసేతర(బ్లూకాలర్) కంపెనీల యజమానులు తమ సిబ్బందికి నెలకు ₹20వేల కంటే తక్కువ వేతనం చెల్లిస్తున్నారని వర్క్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ కేటగిరీలో 57.63% మంది ఉన్నారంది. దీంతో ఆర్థిక కష్టాలతో గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అవసరాల కోసం వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ₹20-40వేల శాలరీ 29.34% మంది, ₹40-60వేల జీతం 10.71% మంది, ₹60వేల పైన శాలరీ 2.31% మంది పొందుతున్నారని తెలిపింది.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై తాను షేర్ చేసిన వీడియోలో బాధితురాలి పేరును ప్రస్తావించినందుకు TMC ఎంపీ, నటి రచనా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. భావోద్వేగంతో మాట్లాడుతుండగా ఆమె పేరు అనుకోకుండా చెప్పినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా నుంచి వీడియోను డిలీట్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు వీడియో వైరలవ్వడంతో ఎంపీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సచిన్ ఆమెపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
AP: గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని CM చంద్రబాబును APCC చీఫ్ షర్మిల కోరారు. ‘గ్రూప్-2, DEO పోస్టులకు 1:100 విధానాన్ని అనుసరించారు. గ్రూప్-1 మెయిన్స్‌కూ దానినే పరిగణనలోకి తీసుకోవాలి. గ్రూప్-2, గ్రూప్-1 పరీక్షల మధ్య టైమ్ తక్కువగా ఉంది. కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌తోనే ప్రిలిమ్స్ నిర్వహించారు. దీని వల్ల తాము నష్టపోయామని అభ్యర్థులు చెబుతున్నారు’ అని లేఖ రాశారు.
‘దేవర’ మూవీపై అభిమానుల్లో రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే’ లిరికల్ వీడియో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయుధ పూజ సాంగ్‌ను కూడా రిలీజ్ చేయాలని అభిమానులు ‘దేవర’ బృందాన్ని కోరారు. మూవీ టీమ్ బదులిస్తూ ’ఆ సాంగ్ వదిలితే ఇప్పుడే పోతారు. లాస్ట్‌లో రిలీజ్ చేస్తాం‘ అని పేర్కొంది. దీంతో హైప్ ఎక్కించి చంపేస్తారా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్‌లో జరగనున్న యాపిల్ నెక్ట్స్ ఈవెంట్ ద్వారా ఐఫోన్- 16 మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ కొత్త సిరీస్‌లో 4 ఫోన్లతోపాటు Apple వాచ్ సిరీస్ 10, AirPods 4, మరిన్ని ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి. కొత్త సిరీస్‌లో టైటానియం కలరింగ్, ఫినిషింగ్ మరింత మెరుగ్గా ఉండి, స్క్రాచ్ రెసిస్టెన్స్‌గా ఉంటుందని సమాచారం. ఐఫోన్ 16, ప్లస్ మోడల్స్ ఏ18 బయోనిక్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో రానున్నాయి.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం ఈ కేసుపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. ఆగస్ట్ 9న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది.
Sorry, no posts matched your criteria.