news

News August 10, 2024

ఇండియాలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్ పేల్చనుందా?

image

అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందంటూ నివేదిక బయటపెట్టిన హిండెన్‌బర్గ్ మరో సంచలనానికి తెరతీయనున్నట్లు ప్రకటించింది. ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఇవాళ Xలో పోస్టు చేసింది. దీంతో భారత మార్కెట్లు మరోసారి కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హిండెన్‌బర్గ్ నివేదిక అసత్యమని సెబీ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

News August 10, 2024

30 ఏళ్లు ఆమె నరకం చూపించింది: దువ్వాడ శ్రీనివాస్

image

AP: దువ్వాడ వాణితో రెండేళ్ల నుంచి రాజకీయ, కుటుంబ ఆధిపత్య <<13820134>>పోరు <<>>నడుస్తుందని YCP MLC దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ‘రెండేళ్లుగా విడిగానే ఉంటున్నా. నా ఇంటిపై దాడి చేసిన వాళ్లు నా భార్య, కుమార్తెలే కాదు. పరమ శత్రువులు. ఏ జన్మలో చేసిన పాపమో ఆమెను పెళ్లాడా. 30 ఏళ్లు నరకం చూపించింది. ఇప్పుడే సంతోషంగా ఉంటున్నా. మళ్లీ రౌడీమూకలతో నాపై దాడికి వచ్చింది. ఆమె నుంచి రక్షించాలి’ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 10, 2024

ఏపీలో ప్రాజెక్టుల పేర్ల మార్పు

image

APలోని 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత TDP ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, హంద్రీనీవా సుజల స్రవంతి పేర్లనూ పునరుద్ధరించింది.

News August 10, 2024

వచ్చే ఏడాది DEC 19న అవతార్-3 రిలీజ్

image

విజువల్ వండర్ అవతార్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ మూవీ వచ్చే ఏడాది డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు ఇవాళ ప్రకటించారు. పండోరా గ్రహంలోని కొత్త జీవులు, సంస్కృతుల గురించి ఇందులో చూడబోతున్నారని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చెప్పారు. నాలుగో భాగం 2029 డిసెంబర్ 21, చివరి పార్ట్ 2031 డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

News August 10, 2024

19న రాఖీ.. మహిళల కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు

image

TG: ఈ నెల 19న రాఖీ పండుగను మరింత స్పెషల్‌గా మార్చేందుకు TGSRTC సిద్ధమవుతోంది. సుదూర ప్రాంతాల్లో ఉంటూ తమ సోదరుల దగ్గరకు వెళ్లలేని మహిళలు బహుమతులు, రాఖీలను పంపేందుకు డిపోల్లో కౌంటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రాష్ట్రంతోపాటు AP, మహారాష్ట్ర, కర్ణాటకలోని గమ్యస్థానాలకు 24 గంటల్లో వస్తువులు చేరేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు వసూలు చేసే ఛార్జీలపై ఎల్లుండి స్పష్టత రానుంది.

News August 10, 2024

రుణమాఫీ కాలేదా? అయితే..

image

TG: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయగా, పలువురు తమకు రాలేదంటున్నారు. డబ్బులు అందని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. ‘చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి మాఫీ కాలేదు. అలాంటి వారంతా ఈ నెల 15 తర్వాత వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలను వివరించాలి. ఆ తప్పులను సరిచేసి అర్హులకు రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారు’ అని తుమ్మల చెప్పారు.

News August 10, 2024

భార‌త్‌లో సింహాల సంఖ్య ఎంత‌?

image

2024 నాటికి భారతదేశంలో సుమారు 674 ఆసియా సింహాలు ఉన్నట్టు నివేదిక‌లు చెబుతున్నాయి. 1968లో ఇవి 177 మాత్రమే ఉండేవి. గత దశాబ్దాల్లో చేపట్టిన పునరావాసం – పరిరక్షణ చర్యల వల్ల సింహాల సంఖ్య‌ గణనీయంగా పెరిగింది. ఇవి ప్రధానంగా గుజరాత్‌లోని గిర్ అడవులు సహా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాయి.

News August 10, 2024

NDAకి ఇది మూడోసారి..!

image

గ‌త ప‌దేళ్లలో ఎన్డీయే ప్ర‌భుత్వం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుల‌పై విపక్షాల అభ్యంత‌రాల‌ను పరిగ‌ణ‌నలోకి తీసుకున్న సందర్భాలు త‌క్కువ‌! కానీ మూడు అంశాల్లో కేంద్రం వెనక్కి త‌గ్గిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. గతంలో భూసేక‌ర‌ణ చ‌ట్టం, సాగు చ‌ట్టాల విష‌యంలో వెనక్కి త‌గ్గిన కేంద్రం తాజాగా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును మాత్ర‌మే JPCకి పంపిన సంగతి తెలిసిందే.

News August 10, 2024

గోల్డ్ మెడల్ సాధించిన ఖెలీఫ్.. తాను అమ్మాయినేనని స్పష్టీకరణ

image

ఒలింపిక్స్‌లో జెండర్ <<13757365>>వివాదానికి<<>> కారణమైన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ ఫైనల్‌(66KG)లో యాంగ్ లీ(చైనా)పై 5-0 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ‘ఇతర అమ్మాయిల మాదిరి నేను కూడా స్త్రీనే. అమ్మాయిగానే పుట్టి, పెరిగా. ఇప్పుడు ఉమెన్స్ విభాగంలోనే పోటీ పడి గెలిచా. ఎనిమిదేళ్లుగా పడిన కష్టానికి ఫలితం లభించింది’ అని ఆనందం వ్యక్తం చేశారు.

News August 10, 2024

TG: డెంగ్యూ కేసుల వివరాలు

image

గ‌త 8 నెలల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 3,200 డెంగ్యూ కేసులు న‌మోదైన‌ట్టు అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితి తీవ్రంగా ఉన్న‌ట్టు గుర్తించారు. ఈ వ‌ర్షాకాలంలోనే భారీగా కేసులు న‌మోద‌య్యాయి. ఇక జీహెచ్ఎంసీ ప‌రిధిలో 345 కేసులు న‌మోదైన‌ట్టు వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ కేసులు పెరుగుతుండ‌డంతో న‌గ‌రంలో వాట‌ర్ బాడీస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది ఫాగింగ్ చేస్తున్నారు.

error: Content is protected !!