news

News August 8, 2024

సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో ఎంగేజ్మెంట్?

image

సమంత తనకు ప్రపోజ్ చేసిన రోజే నాగచైతన్య ప్రేయసి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఏమాయ చేశావే’ రిలీజయ్యాక ఆగస్టు 8వ తేదీన సమంత ప్రపోజ్ చేశారని చెబుతున్నారు. దీంతో ఇదేరోజు ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ శుభకార్యానికి ముందే చైతూ తన మాజీ భార్యతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా నుంచి తొలగించారు. కేవలం ‘మజిలి’ సినిమా ఫొటోలే ఉన్నాయి.

News August 8, 2024

సెమీస్‌కు అమన్

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ను మరో పతకం ఊరిస్తోంది. మెన్స్ 57కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రెజ్లర్ అమన్ సెహ్రావత్ సెమీఫైనల్ చేరారు. క్వార్టర్ ఫైనల్లో అతడు జెలిఖాన్‌పై 12-0 తేడాతో ఘన విజయం సాధించారు. ఇవాళ రాత్రి జరిగే సెమీఫైనల్ పోరుతో అతడు నంబర్ వన్ సీడ్ రెయ్ హిగుచీని ఢీకొట్టనున్నారు. సెమీస్‌లో గెలిస్తే పతకం ఖాయం కానుంది.

News August 8, 2024

Stock Market: మళ్లీ నష్టాలు

image

RBI వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచ‌డంతో దేశీ స్టాక్ మార్కెట్లు వొల‌టైల్ అయ్యాయి. సెన్సెక్స్ 582, నిఫ్టీ 180 పాయింట్లు న‌ష్ట‌పోయాయి. ఎర్నింగ్స్ అండ్ గ్రోత్ ప‌రంగా మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ స్టాక్స్‌ని ఓవ‌ర్ వ్యాల్యూగా ప‌రిగ‌ణిస్తూ ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డిన‌ట్టు నిపుణులు చెబుతున్నారు. ఎమ‌ర్జింగ్ మార్కెట్స్‌తో పోలిస్తే హై వ్యాల్యూయేష‌న్ కూడా న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

News August 8, 2024

కేరళకు బయల్దేరిన చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి కేరళకు బయల్దేరారు. వయనాడ్ బాధితులకు కోసం ఆయన రూ.కోటి చెక్కును ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు అందించనున్నారు. రామ్‌చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించిన విషయం తెలిసిందే.

News August 8, 2024

‘పుష్ప-2’ నుంచి అదిరిపోయే అప్డేట్

image

నటుడు ఫహద్ ఫాజిల్ బర్త్ డే సందర్భంగా ‘పుష్ప-2’ నుంచి అప్డేట్ వచ్చింది. ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మాస్ లుక్‌లో ఉన్న భన్వర్ సింగ్ షెకావత్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 6వ తేదీన బిగ్ స్క్రీన్‌లపై సందడి చేయనున్నారని తెలియజేశారు. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News August 8, 2024

ఫిక్సింగ్ కలకలం.. శ్రీలంక ఆటగాడిపై ఐసీసీ చర్యలు

image

ఫిక్సింగ్‌కు ప్రయత్నించిన శ్రీలంక బౌలర్ ప్రవీణ్ జయవిక్రమపై ICC 3 అభియోగాలు మోపింది. ‘ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఫిక్సింగ్ కోసం సంప్రదించిన వారి గురించి అతను నివేదించలేదు. LPLలో ఫిక్సింగ్ కోసం మరో ఆటగాడిని సంప్రదించారు. మెసేజ్‌లను డిలీట్ చేసి విచారణకు ఆటంకం కలిగించారు. ఇందుకుగాను చర్యలు తీసుకునేందుకు లంక బోర్డు, ICC నిర్ణయించాయి’ అని పేర్కొంది. వీటిపై స్పందించేందుకు ఆటగాడికి 14 రోజుల సమయం ఇచ్చింది.

News August 8, 2024

UPI పేమెంట్లు చేసే వారికి గుడ్‌న్యూస్

image

UPI చెల్లింపుల్లో డెలిగేటెడ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు RBI ఇవాళ ప్రకటించింది. దీని ద్వారా ఒక యూజర్ తన బ్యాంక్ ఖాతా నుంచి కొంత లిమిట్ వరకు మరొక వ్యక్తికి UPI లావాదేవీ చేసేందుకు అనుమతి ఇవ్వొచ్చు. ఇందుకోసం సెకండరీ యూజర్‌కు UPIకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాల్సిన పనిలేదు. ఈ నిర్ణయంతో తమ బ్యాంక్ ఖాతా నుంచి సొంత కుటుంబ సభ్యులు UPI లావాదేవీలు చేసేలా వెసులుబాటు లభిస్తుంది.

News August 8, 2024

రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై మూడేళ్లు నిషేధం

image

ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్(IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్ల పాటు ఆమెపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతిమ్ అక్రిడిటేషన్‌తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడంతో పోలీసులు <<13802848>>అరెస్ట్ <<>>చేసిన విషయం తెలిసిందే.

News August 8, 2024

విప‌క్షాల డిమాండ్‌ను అంగీకరించిన కేంద్రం

image

వ‌క్ఫ్ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లును జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి పంపడానికి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ప్రభుత్వం గురువారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఈ బిల్లును ఇండియా కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. ప్ర‌భుత్వ‌ ఉద్దేశాల‌ను కేంద్ర మంత్రి రిజిజు వివ‌రించే ప్ర‌య‌త్నం చేసినా విప‌క్షాలు వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో జేపీసీకి పంపాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

News August 8, 2024

UPSC అభ్యర్థికి వరల్డ్ వార్-2 నాటి వ్యాధి

image

‘పైలోనిడల్ సైనస్’ అనే వ్యాధితో బాధపడుతున్న ఓ UPSC అభ్యర్థికి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. లైబ్రరీ కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులలో తొలిసారి గుర్తించారు. పిరుదుల పైభాగంలో ఓ చీలిక ఏర్పడి, ఇందులో వెంట్రుకలు, చెత్త పేరుకుపోయి చీము పడుతూ ఉంటుంది. దీనివల్ల రోగికి తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది.

error: Content is protected !!