India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాలుష్యాన్ని అధిగమించేందుకు విమానం తరహాలో 132 సీట్ల బస్సును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు వెల్లడించారు. మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఏర్పాటు చేస్తారు. ఈ బస్సు 40 సెకన్లు ఛార్జింగ్ చేస్తే 40 కి.మీ ప్రయాణిస్తుంది. విమానంలోలా సీటింగ్, ఏసీ, ఫుడ్, డ్రింక్స్ ఉంటాయి. వీటిని అందించడానికి ‘బస్ హోస్టెస్’ ఉంటారు.
TG: రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జూన్ 30తో ముగిసిందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 8.99 లక్షల మంది రైతుల నుంచి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.10,547 కోట్లు జమ చేసినట్లు పేర్కొంది.
రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని ఓ ఖైదీకి ఒడిశా హైకోర్టు ఉరి శిక్ష రద్దు చేసింది. 2014లో జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో అఖీల్ అలీ, ఆసిఫ్ అలీ ఆరేళ్ల చిన్నారిపై రేప్ చేసి, చంపేశారు. వీరికి 2022లో పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. ఆసిఫ్ రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని, నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ హైకోర్టు మరణ శిక్షను జీవిత ఖైదుకు తగ్గించింది. అఖీల్ అలీని నిర్దోషిగా ప్రకటించింది.
‘కల్కి’ విజయంతో జోరుమీదున్న డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్‌లో ఈ నెల నుంచి పాల్గొననున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈనెల 15 తర్వాత ప్రభాస్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది.
పుణేలో ‘జికా’ వైరస్ <<13549424>>సోకిన<<>> నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. గర్భిణులను అప్రమత్తం చేస్తూ జికా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. వైరస్ సోకిన వారిలో పిండం పెరుగుదలను క్షుణ్ణంగా పరిశీలించాలంది. ఆసుపత్రుల్లో సౌకర్యాలపై నోడల్ అధికారులను నియమించాలని పేర్కొంది. ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది.
TG: PCC అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్ఠానం వాయిదా వేసినట్లు సమాచారం. వారం రోజుల్లో మరోసారి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. కాగా PCC చీఫ్ పదవి కోసం BC వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. కానీ మహేశ్ కుమార్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం.
దిబ్రుగడ్ జైల్లో ఉన్న‘వారీస్ పంజాబ్ దే’ చీఫ్, ఖలీస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌కు 4 రోజుల పెరోల్ లభించింది. దీంతో ఎల్లుండి ఆయన ఖాడూర్ సాహిబ్ ఎంపీగా లోక్‌సభ స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో జైలు నుంచే పోటీ చేసిన అమృత్‌పాల్ సుమారు 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
TG: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జులై 5 నుంచి 20 వరకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు.
పరిమితంగా వాడుకుంటూ టైమ్‌కి క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నా పలు సందర్భాల్లో క్రెడిట్ స్కోరు తగ్గుతుందంటున్నారు నిపుణులు. ‘మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తే 50 పాయింట్లపైన తగ్గొచ్చు. లోన్ తీసుకుంటే తొలుత స్కోరు తగ్గినా టైమ్లీ పేమెంట్స్‌తో కవర్ చేయొచ్చు. యాడ్ ఆన్ కార్డు ఉంటే టైమ్‌కి బిల్లు కట్టాలి. మీ ష్యూరిటీతో మరొకరు లోన్ తీసుకుని EMI కట్టకున్నా మీ సిబిల్ స్కోర్ తగ్గుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ పేరుతో Xలో ఓ ఫేక్ అకౌంట్ సృష్టించారు. తన పేరుతో నకిలీ ఖాతా క్రియేట్ చేయడంతో సంజన మండిపడ్డారు. ‘నా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని ఎవరో దొంగిలించి అచ్చం నా అకౌంట్ లాగే మరో ఖాతా తెరిచారు. వెంటనే దీనిని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.