India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇవాళ్టి నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఇవాళ మధ్యాహ్నం కోల్‌కతా నుంచి HYD రానున్నారు. 27వ తేదీ వరకు విచారణ చేపట్టనున్న ఆయన.. ఒకరోజు మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. విచారణ కోసం కావాల్సిన సాంకేతిక, న్యాయపరమైన సిబ్బందిని ఆయన నియమించుకోనున్నారు.
TG: కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాల అభ్యర్థులపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇవాళ జాబితా రానున్నట్లు సమాచారం. ఖమ్మం అభ్యర్థిగా రఘురామిరెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండగా మరో అభ్యర్థిని పరిశీలించాలని ఒత్తిడి రావడంతో అధికారిక ప్రకటన ఆగింది. మరోవైపు కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్‌కు మహ్మద్ వలీ ఉల్లా సమీర్ పేర్లను INC పరిశీలించినట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను నిన్న 124 నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలు చేసినవారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీ సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. కీలక అభ్యర్థుల్లో రాపాక వరప్రసాదరావు(అమలాపురం వైసీపీ), కారుమూరి సునీల్(ఏలూరు వైసీపీ), వల్లభనేని అనుదీప్(మచిలీపట్నం జనసేన), మాగుంట శ్రీనివాసరెడ్డి(ఒంగోలు టీడీపీ), వైఎస్ అవినాశ్(కడప వైసీపీ), విజయసాయి(నెల్లూరు వైసీపీ) తదితరులున్నారు.
బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ ‘వాంటేజ్’ పేరుతో కొత్త మోడల్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. దీని ధరను రూ.3.99 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ మోడల్ టాప్ స్పీడ్ గంటకు 325కి.మీ కాగా.. 0-96కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే ఈ కారు అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో వెట్, స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్, ట్రాక్, ఇండివిడ్యువల్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.
TG: ఒకప్పుడు సీపీఐకి, ఇప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి లోక్‌సభ నియోజకవర్గం నల్గొండ. BRS, BJP ఒక్కసారీ గెలవని సెగ్మెంట్ కూడా ఇదే. ఈసారి రఘువీర్ రెడ్డి(INC), కంచర్ల కృష్ణారెడ్డి(BRS), శానంపూడి సైదిరెడ్డి(BJP) పోటీ చేస్తున్నారు. పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని BJP, BRS ఆరాటపడుతున్నాయి. ఇక్కడ INC, CPI చెరో 7సార్లు, TDP 2సార్లు, తెలంగాణ ప్రజా సమితి, PDF చెరోసారి గెలిచాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి- హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్‌గా ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర వర్గాలు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో దేవరలో, రామ్‌చరణ్‌తో ఓ సినిమాలో జాన్వీ నటిస్తోన్న విషయం తెలిసిందే.
AP: ఈ నెల 25న APRJC, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి ఉ.10 నుంచి మ.12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. అలాగే డీసీ సెట్‌కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని.. వీరికి రేపు మ.2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభం అవుతాయి. సెలవుల్లో ప్రైవేటు స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ విద్యాశాఖ <<13091267>>‘సెలవుల్లో సరదాగా’<<>> కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
దళిత యువకులకు శిరోముండనం చేసిన కేసులో బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విశాఖ SC, ST కోర్టు YCP MLC తోట త్రిమూర్తులు, మరో 8మందికి 18 నెలల జైలు శిక్ష విధించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. కాగా బాధితులు తమ వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో వారిని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిన న్యాయమూర్తి మే 1కి విచారణను వాయిదా వేశారు.
ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 8 మ్యాచ్‌లలో 4 గెలుపులతో GT ఆరో స్థానంలో, 3 విజయాలతో DC ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాయి. నేడు గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్ల కెప్టెన్లు గిల్, పంత్ భావిస్తున్నారు. IPLలో ఇప్పటి వరకు ఈ టీమ్‌లు 4 సార్లు తలపడగా, చెరో రెండు సార్లు గెలిచాయి.
Sorry, no posts matched your criteria.