India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతికి రూ.774.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అందులో చరాస్తులు రూ.602.46 కోట్లు కాగా స్థిరాస్తులు 103.71 కోట్లు. ఇక భారతి వద్ద రూ.5 కోట్లు విలువ చేసే నగలు ఉన్నాయి. సీఎం జగన్‌కు రూ.1.10 కోట్లు, భారతికి రూ.7.41 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్‌పై 26 కేసులు ఉన్నాయి. ఐదేళ్లలో కుటుంబ ఆస్తులు రూ.499 కోట్ల నుంచి రూ.774 కోట్లకు పెరిగాయి.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ప్రత్యేకం కానుంది. MI తరఫున హార్దిక్‌కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటివరకు ముంబై తరఫున 99 మ్యాచులు ఆడిన పాండ్య 1,617 పరుగుల చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో పాండ్య 130 మ్యాచులు ఆడారు. కాగా MI తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రోహిత్(205) ముందు వరుసలో ఉన్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబును సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు కలిశారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కెప్టెన్ పాట్ కమిన్స్, బ్యాటర్ మయాంక్ అగర్వాల్.. మహేశ్‌తో ముచ్చటించారు. ‘ది ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్‌తో మేము’ అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను మయాంక్ ట్వీట్ చేశారు. ఓ యాడ్ షూట్ కోసమే వారు కలిసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 25న ఆర్సీబీతో ఆడనుంది.
భారత్‌కు చెందిన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను సింగపూర్ నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఎవరెస్ట్‌తో పాటు MDH సాంబార్ మసాలాను హాంకాంగ్ నిషేధించింది. వాటిలో క్యాన్సర్ కారకాలున్నాయని హాంకాంగ్ ఆరోపించింది. దీంతో ఎవరెస్ట్, MDH కంపెనీలతో పాటు అన్ని కంపెనీల మసాలా ఉత్పత్తుల నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షించాలని ఫుడ్ కమిషనర్లను కేంద్రం ఆదేశించిందట. 20రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి. పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెంకు బయల్దేరేందుకు పవన్ హెలికాఫ్టర్ ఎక్కగా.. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని పేర్కొంది.
సూరత్ కాంగ్రెస్ MP అభ్యర్థి నీలేశ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడంతో BJP అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ పత్రాల్లోని సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటంతో నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నీలేశ్‌కు ప్రత్యామ్నాయంగా నామినేషన్ వేసిన మరో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ పద్సాల నామినేషన్ సైతం తిరస్కరణకు గురైంది. వీరిద్దరు వేసిన 4 నామినేషన్లూ రిజెక్ట్ అయ్యాయి.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ సీజన్-17 మొత్తానికి దూరమయ్యారు. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం అతడు కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియాకు వెళ్లారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. మార్ష్ ఈ ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈ నెల 3న చివరి మ్యాచ్ ఆడారు.
AP: గుంటూరు పార్లమెంట్ TDP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక MP అభ్యర్థిగా నిలుస్తున్నారు. తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ ₹5,598.65 కోట్లు కాగా స్థిరాస్తులు ₹186.63cr. ఇక అప్పులు ₹1,038 కోట్లు ఉన్నట్లు తెలిపారు. వైద్యుడైన చంద్రశేఖర్ అమెరికాలో వైద్యవృత్తితో పాటు వివిధ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు.
జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.
ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా విధించింది. నిన్న KKRతో మ్యాచ్‌లో అంపైర్లతో వాగ్వివాదంతో మ్యాచు ఫీజులో 50 శాతం కోత వేసింది. నిన్న కోహ్లీ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చినట్లు స్టార్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా డుప్లెసిస్, సామ్ కరన్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.