news

News April 12, 2024

తులం బంగారం రూ.73,310, కేజీ వెండి రూ.90,000

image

బంగారం, వెండి ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇవాళ మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.1,090 పెరిగి రూ.73,310కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1000 పెరిగి రూ.67,200గా నమోదైంది. వెండి కూడా కేజీకి రూ.1500 పెరిగి రూ.90,000కు చేరింది.

News April 12, 2024

కౌంట్‌డౌన్: పోలింగ్ @32.. తీర్పు @52

image

తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవనుంది. నేటి నుంచి సరిగ్గా 32వ రోజు మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా రోడ్‌షోలు, సభలతో పార్టీల అధినేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

News April 12, 2024

కాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

AP ఇంటర్ ఫలితాలు ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. BIEAP అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

News April 12, 2024

రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు.. ప్రధాన నిందితుడు అరెస్ట్

image

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు ముస్సావిర్ షాజీబ్ హుస్సేన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత అతడు అస్సాం, పశ్చిమబెంగాల్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

News April 12, 2024

భరోసాగా మారండి.. భారంగా కాదు

image

కాసేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎవరూ ఫెయిల్ కావాలని, మార్కులు తక్కువ రావాలని పరీక్షలు రాయరు. కానీ అనుకోని ఫలితం ఎదురైతే ఒత్తిడికి గురయ్యే యువ హృదయాలకు తల్లిదండ్రులు అండగా నిలవండి. నిరాశ చెందే మీ పిల్లలకు జీవితం అంటే ఇది మాత్రమే కాదని, ఇక్కడితోనే అంతా ఆగిపోదని భరోసానివ్వండి. భయాందోళనలో ఉండే మీ పిల్లలను కనురెప్పల్లా కాపాడుకోండి తప్ప.. భరించలేని భారంగా వారికి కన్పించవద్దని మనవి.

News April 12, 2024

చంద్రబాబుతో రామరాజు భేటీ?

image

AP: ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఉండి టికెట్‌పై ఆయన స్పష్టత తీసుకునేందుకు చర్చలు జరపనున్నారు. కాగా ఉండి టికెట్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబుపై రామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబల్‌గానైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

News April 12, 2024

ఓటు హక్కుపై ఆసక్తి చూపని యువత

image

దేశ యువత ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఓటు హక్కు కోసం యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే 18-19ఏళ్ల యువతలో 40% కంటే తక్కువ మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ఓటు హక్కుపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా యువత తీరు దేశాన్ని కలవరపరిచేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News April 12, 2024

BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఉద్యోగుల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ పద్ధతిని అమల్లోకి తేనుంది. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో చాలా రిటైర్మెంట్లు ఆగిపోయాయి. మార్చి 31 నుంచి రిటైర్మెంట్లు మళ్లీ మొదలవడంతో ఖాళీలు ఏర్పడనున్నాయి.

News April 12, 2024

బుమ్రా నా కాళ్లను పచ్చడి చేసేవాడు: సూర్య

image

నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లతో నా కాళ్లను పచ్చడి చేసేవాడని.. లేదంటే బ్యాట్ విరగ్గొట్టేవాడని ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేమిద్దరం రెండు మూడేళ్లుగా కలిసి ఆడుతున్నామని.. అప్పటినుంచి ఇదే పరిస్థితి అని చెప్పారు. కాగా నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. తన యార్కర్లతో RCB బ్యాటర్లకు చుక్కలు చూపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

News April 12, 2024

శిరోముండనం కేసులో నేడే తుది తీర్పు

image

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో ఇవాళ విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ తుది తీర్పు వెలువరించనుంది. 27 ఏళ్ల కిందట కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. ఇద్దరికి గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించారు. బాధితుల్లో ఒకరు మరణించగా.. మిగతా నలుగురు న్యాయం కోసం కోర్టుకెళ్లారు. YCP MLC తోట త్రిమూర్తులు సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.