India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నేడు సీఎం జగన్ బస్సుయాత్రకు విరామమిచ్చారు. రంజాన్ సందర్భంగా ఆయన యాత్రకు విరామం తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే సీఎం బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘వార్-2’ మూవీపై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. రేపు ఈ మూవీ సెట్స్‌లో ఎన్టీఆర్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఈ షూట్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎన్టీఆర్ 60 రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్లు టాక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, శార్వరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జాన్ అబ్రహాం విలన్ పాత్ర పోషిస్తున్నారు.
TG: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. వర్షాలు సరిపడినంతగా పడకపోవడంతో 510.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో పెట్టుకుంటే మేలో తాగునీటిని అందించడం కష్టంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఈ జలాశయంలో 132.86 టీఎంసీల నీరు ఉంది. అత్యవసర పరిస్థితుల్లో నీటిని 505 అడుగుల వరకు విడుదల చేయాలని కేఆర్ఎంబీ యోచిస్తున్నట్లు సమాచారం.
AP: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు వేటపై విధించనున్న నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే బోట్లతో సహా వాటిలోని మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటామని పేర్కొంది. ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 సెక్షన్ (4) కింద శిక్ష పడుతుందని, డీజిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపివేస్తామని తెలిపింది.
TG: ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు ఎన్నికల కోడ్ షాక్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో గత నెలలో ఇచ్చిన ‘సున్నా’ బిల్లులను వెనక్కి తీసుకుంది. HYDలోని సరూర్‌నగర్‌లో ఓ వినియోగదారుడికి మార్చి 2న రూ.262తో జీరో బిల్లు ఇచ్చారు. ఈనెల రూ.547 రాగా.. మొత్తం కలిపి రూ.809 చెల్లించాలని కొత్త బిల్లు జారీ చేశారు. అయితే.. సాంకేతిక సమస్యతో మార్చిలో సున్నా బిల్లులు జారీ అయ్యాయని డిస్కం అధికారులు చెప్పారు.
AP: నిన్న విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్‌కు 92,250 మంది అర్హత సాధించారు. FEB 25న నిర్వహించిన పరీక్షకు 4,04,039 మంది హాజరు కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా వీలైనంత ఎక్కువ మందికి మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 మంది చొప్పున సెలెక్ట్ చేసినట్లు బోర్డు తెలిపింది. జులై 28న మెయిన్స్ జరగనుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ఓట్లు అభ్యర్థించనున్నారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాల్లో లోకేశ్ రోడ్‌షోల్లో పాల్గొంటారు. అనంతరం తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.
AP: TET-2024, DSC కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు ఫీజును తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. అభ్యర్థుల ఆధార్‌తో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపింది. 50,206 మందికి ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 44,690 మందికి చెల్లించినట్లు పేర్కొంది. డబ్బులు జమ కాని వారు కమిషనర్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆధార్ లింకై ఉన్న అకౌంట్ వివరాలు ఇవ్వాలని సూచించింది.
TG: వర్షాకాలంలో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాంట్రాక్ట్ కంపెనీలకు నీటి పారుదల శాఖ సూచించింది. అయితే.. మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లకు కలిపి రూ.600కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరమ్మతులకు ఎంత ఖర్చవుతుంది? దాన్ని ఎవరు భరించాలనేది తేలితేనే ఈ మరమ్మతులు జరిగే అవకాశం ఉంటుంది.
TG: టెట్ దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు పొడిగించిన ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు తమ దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకోవచ్చని తెలిపింది. ఈనెల 9వ తేదీ నాటికి 1,93,135 దరఖాస్తులు రాగా, గతంతో పోల్చితే అప్లికేషన్లు తక్కువగా రావడంతో గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.