news

News April 10, 2024

అంబటి రాయుడి ‘సిద్ధం’ ట్వీట్ ఇందుకేనా?

image

క్రికెటర్ అంబటి రాయుడు ‘సిద్ధం’ అని ట్వీట్ చేయడంతో ఆయన తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు అంతా భావించారు. అయితే, జనసేన పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేయగా అందులో రాయుడి పేరుంది. రాయుడు జనసేనకి మద్దతిస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీంతో జనసైనికులు సైతం ఆయనను ఆహ్వానిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

News April 10, 2024

రాజకీయాలంటే జనసేనకు కామెడీ అయిపోయింది: YCP

image

జనసేన ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ జనసేన పార్టీకి అంత కామెడీ అయిపోయాయి. ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్ షీట్లు చూసుకోండి’ అని ట్వీట్ చేసింది.

News April 10, 2024

ప్రజల కోసం నిలబడ్డ హీరో పవన్ కళ్యాణ్: CBN

image

AP:ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. ‘అక్రమాలు, వ్యక్తిగత దాడులను తట్టుకుని పవన్ నిలబడ్డారు. శిథిలమైన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీ మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిశాయి. ఇక YCPకి డిపాజిట్లు వస్తాయా? యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్‌కు పారిపోతారు. విధ్వంస పాలన కావాలో? అభివృద్ధి పాలన కావాలో? యువతకు ఉద్యోగాలు కావాలో? గంజాయి కావాలో? ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.

News April 10, 2024

ఎనిమిదేళ్లలో ఆరు రెట్లు పెరిగిన SIP పెట్టుబడులు

image

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కింద మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గత 8ఏళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. SIP పెట్టుబడుల విలువ 2016 APRలో రూ.3,122 కోట్లు ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరికి రూ.19,187 కోట్లకు చేరింది. 2015 మార్చిలో 73లక్షలుగా ఉన్న SIP అకౌంట్లు ఇప్పుడు 8.20కోట్లకు చేరినట్లు AMFI వెల్లడించింది. ‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’ పేరుతో కేంద్రం చేసిన విస్తృత ప్రచారమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.

News April 10, 2024

వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు

image

AP: రానున్న ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తణుకు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. ‘రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగళానికి వారాహి తోడైంది. సైకిల్ స్పీడ్‌కి, గ్లాసు జోరుకు తిరుగులేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాయి. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. చీకటి పాలనను అంతం చేయడానికి ఓటు చీలకూడదు’ అని ఆకాంక్షించారు.

News April 10, 2024

CBN ఎన్నికల ముందు గంగ.. తర్వాత చంద్రముఖి: సీఎం

image

AP: జాబు రావాలంటే.. బాబు రావాలంటూ భ్రమ కల్పిస్తున్నారని CM జగన్ మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎన్నికల ముందు గంగ.. ఆ తర్వాత చంద్రముఖి. ఆయన హయాంలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయా? మా ప్రభుత్వంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. జాబు రావాలంటే.. జగన్ కావాలి. జాబుల విషయంలో బాబుది బోగస్ రిపోర్ట్. ఎల్లో మీడియా, కూటమి పార్టీలు గాడిదను గుర్రంలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి’ అని దుయ్యబట్టారు.

News April 10, 2024

అభ్యర్థి మృతి.. ఎన్నిక వాయిదా

image

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన BSP అభ్యర్థి అశోక్ మృతి చెందడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 26న ఎన్నిక జరగాల్సి ఉండగా మే 7వ తేదీకి EC వాయిదా వేసింది. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాయిదా వేసినట్లు EC తెలిపింది. ఎన్నికలకు ముందు జాతీయ పార్టీ లేదా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే, కొత్త వ్యక్తిని ప్రకటించడం కోసం ఎన్నికను వాయిదా వేస్తారు.

News April 10, 2024

ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ – 1/3

image

ఎన్నికల వేళ కేరళలో పరిస్థితి చర్చ్ vs చర్చ్ అన్నట్టు తయారైంది. క్రిస్టియన్ల ఓట్ల కోసం సినిమా/డాక్యుమెంటరీలు ప్రచార ఆయుధాలుగా మారాయి. వివాదాస్పద కేరళ స్టోరీ సినిమాను ఇడుక్కి డియోసీస్, కేరళ కాథలిక్ యూత్ మూ‌వ్‌మెంట్ సహా పలు క్రైస్తవ సంఘాలు చర్చీల్లో ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు కౌంటర్‌గా మరికొన్ని సంఘాలు మణిపుర్ పరిస్థితులపై తెరకెక్కిన ‘క్రై ఆఫ్ ది అప్రెస్డ్’ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నాయి. <<-se>>#Elections2024<<>>

News April 10, 2024

ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ – 2/3

image

కేరళలో క్రైస్తవుల జనాభా 18% కాగా వీరిలో కాథలిక్, సిరియన్ క్రిస్టియన్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రొటెస్టెంట్లు, లాటిన్ క్రిస్టియన్లు అధికార కూటమి, కమ్యూనిస్ట్ పార్టీల సమూహమైన LDFకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల అక్రమ రవాణా, మతమార్పిడులు వంటి అంశాలతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ బీజేపీకి అనుకూలం కావొచ్చనేది విశ్లేషకుల మాట. కాగా ఈ ప్రదర్శనలతో తమకు సంబంధం లేదని BJP పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>

News April 10, 2024

ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ – 3/3

image

కేరళ స్టోరీకి కౌంటర్‌గా మణిపుర్ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ప్రధాన కారణం కుకీ తెగ అంటున్నారు విశ్లేషకులు. ఈ తెగలో అధికశాతం మంది క్రైస్తవులే. మైతీ-కుకీల మధ్య జరిగిన హింసపై రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఓట్లను ప్రభావితం చేయొచ్చంటున్నారు. పొలిటికల్ అజెండా లేదంటూనే ఇరు పక్షాలూ సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ స్టోరీ ప్రదర్శనలపై UDF, LDF కూటమి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోందట. <<-se>>#Elections2024<<>>