news

News April 4, 2024

48గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బు: చౌహాన్

image

TG: యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ DS చౌహాన్ స్పష్టం చేశారు. ‘ధాన్యం విక్రయించిన రైతుల అకౌంట్లో 48గంటల్లోనే డబ్బు జమ చేస్తాం. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులు చేసేందుకు 1967తో పాటు 1800 4250 0333 టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటాయి’ అని వెల్లడించారు.

News April 4, 2024

వరుస ప్రమాదాలు.. కార్మికుల ఆందోళన!

image

TG: సంగారెడ్డి(D) చందాపూర్ పేలుడు <<12982731>>ఘటన<<>>లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పారిశ్రామిక వాడలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండడంపై కార్మికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలం చెల్లిన రియాక్టర్ల వాడకం, రెగ్యులర్‌గా తనిఖీలు చేయకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రెండేళ్లలో 40 ప్రమాదాలు జరగగా, 72 మంది మృతిచెందినట్లు, మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

News April 4, 2024

పిరికితనంతోనే పవన్ వ్యాఖ్యలు: ముద్రగడ

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ‘కార్యకర్తలను కూడా పవన్ దగ్గరకు ఆయన భద్రతా సిబ్బంది రానివ్వరు. రోజుకు 3 షిఫ్టుల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్ అంటూ <<12968934>>మాట్లాడటం<<>> హాస్యాస్పదంగా ఉంది. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

News April 4, 2024

MP నవనీత్‌ కేసులో నేడు సుప్రీం తీర్పు

image

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమె 2019లో SC కేటగిరిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె SC సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా.. రాణా ఇటీవలే BJPలో చేరారు. ఈ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీలో ఉన్నారు.

News April 4, 2024

కవిత‌కు బెయిల్ వస్తుందా?

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వనున్నారు.

News April 4, 2024

డేంజర్ జోన్‌లో పంత్!

image

KKRతో మ్యాచ్‌లో DC స్లో ఓవర్ రేటు మెయింటేన్ చేయడంతో BCCI మరోసారి జరిమానా విధించింది. CSKతో మ్యాచులోనూ DC ఇదే తప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు రూ.12 లక్షలు ఫైన్ వేయగా.. రెండోసారి అదే తప్పు చేసినందుకు పంత్‌కు రూ.24 లక్షల జరిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌‌ సహా ఢిల్లీ ఆటగాళ్లందరికీ రూ.6 లక్షల జరిమానా పడింది. మరోసారి ఇదే జరిగితే పంత్‌కి రూ.30 లక్షల ఫైన్‌తో పాటు ఒక మ్యాచ్‌ నిషేధిస్తారు.

News April 4, 2024

కామెడీ కథకు ఓకే చెప్పిన రవితేజ?

image

మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్‌కు పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. కానీ, ప్రస్తుతం ఆయన ఎంటర్‌టైన్మెంట్ సినిమాలను పక్కన పెట్టి యాక్షన్ మూవీలు చేస్తూ హిట్ అందుకోలేకపోతున్నారు. అభిమానులు కూడా డిమాండ్ చేస్తుండడంతో రవితేజ కామెడీ కథను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘సామజవరగమన’ కథా రచయిత భాను బోగవరపు చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందట. అతడిని దర్శకుడిగా పరిచయం చేయాలని డిసైడ్ అయినట్లు సినీ వర్గాల సమాచారం.

News April 4, 2024

త్వరలో ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్!

image

బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు భారతీయ ఈవీ కార్ల తయారీ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. టెస్లా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఇండియాలో అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో పడింది. ఈక్రమంలో ఈనెలలోనే అమెరికా నుంచి టెస్లా బృందం ఇండియాకు రానుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఏర్పాటైన ఆటోమోటివ్ హబ్‌లతో ఈ బృందం ప్లాంట్ కోసం స్థలాన్ని గుర్తించనుంది.

News April 4, 2024

వడగాల్పులు.. వైద్యశాఖ సూచనలు

image

AP: ➥ బయటకు వెళ్లేటప్పుడు తలపై టోపీ/గొడుగు/ తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలి.
➥ఎండలో నుంచి వచ్చాక నీరు, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్, మజ్జిగ, ORS వంటివి తీసుకోవాలి. తేనె వంటి తీపి పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌కూ దూరంగా ఉండాలి
➥ఉ.10 నుంచి సా.4గంటల మధ్య ఎండలో శారీరక శ్రమను పెంచే పనులు చేయకూడదు.
➥తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తే వడదెబ్బగా గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి.

News April 4, 2024

చావుబతుకుల మధ్య హీరోయిన్

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా <<12901010>>గాయపడిన<<>> కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నట్లు సోదరి ఆర్తీ తెలిపారు. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రక్తం గడ్డకట్టడంతో ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేసినట్లు చెప్పారు. పక్కటెముకల శస్త్రచికిత్సకు కావాల్సిన సాయం చేయాలని ఆమె కోరారు. రోజుకు ₹2లక్షల చొప్పున ఇప్పటివరకు ₹40 లక్షలు ఖర్చైనట్లు పేర్కొన్నారు.