India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ నుంచి పలు వస్తువులు చోరీకి గురవ్వడం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది. తీరా దర్యాప్తు చేస్తే ఆ చోరులు మీడియా వారే అని తేలింది. తాము ఆ విమానంలో ప్రయాణించామని చెప్పుకొనేందుకు వస్తువుల్ని దొంగిలిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అలా తీసుకెళ్లొద్దని, కావాలంటే విమానంలో దిగిన ఫొటోలను ఇస్తామని విజ్ఞప్తి చేశారు.
ఈనెల 4,5,6 తేదీల్లో జరగనున్న JEE మెయిన్ సెషన్-2 పేపర్-1(బీఈ/బీటెక్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. <
ప్రముఖ ఈ-స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్థిక ఏడాదిలో (2023-24) 115% వృద్ధిని కనబరిచింది. FY24లో 3,28,785 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. అంతకుముందు ఏడాదితో (FY23- 1,19,310) పోలిస్తే రెండింతలు ఎక్కువ. గతనెల ఏకంగా 53వేల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని.. JAN-MAR త్రైమాసికంలో 1,19,310 రిజిస్ట్రేషన్లు రికార్డ్ అయినట్లు సంస్థ వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం IPOను ప్రవేశపెట్టే ప్లాన్‌లో ఉంది.
AP: రాష్ట్రంలో YCPతో పాటు TDP, BJP, JSP కూటమి దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఒక్క అభ్యర్థి పేరునూ ఖరారు చేయలేదు. జాబితాపై APCC చీఫ్ షర్మిల ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఆమె కడప MP అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. రేపు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమెన్స్ హాస్టల్‌లోని ఫుడ్‌లో గొంగళి పురుగు వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఓయూ అధికారులు స్పందించారు. ‘హాస్టల్ ఫుడ్‌లో గొంగళి పురుగు వచ్చిందనేది తప్పు. ఇక్కడి హాస్టల్‌లో అరటి ఆకులపై ఆహారం అందించట్లేదు. ఇది ఫేక్. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. షేర్ చేసే ముందు ధ్రువీకరించుకోండి’ అని ట్వీట్ చేశారు.
అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా, శ్రీనివాస్‌రెడ్డి, సునీల్, సత్యం రాజేశ్, అలీ, బ్రహ్మాజీ తదితరులు నటించారు. 2014లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన ‘గీతాంజలి’కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
జ్ఞానవాపి మసీదులో పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హిందువులు చేసే పూజలు మసీదు సెల్లార్ ప్రాంతానికే పరిమితం కావాలని ఆదేశించింది. ముస్లిములు ఉత్తర ప్రాంతంలో తమ ప్రార్థనలను యథావిధిగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ప్రాంతంలో సర్వేపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
TG: కేసీఆర్ తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు ఉందని మెదక్ BJP MP అభ్యర్థి రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ‘నీ పార్టీ విడిచిపెట్టిపోతే కుక్కలు, నక్కలు అంటావా? గతంలో KCR ఇతరులను తన పార్టీలో చేర్చుకోలేదా? మరి మీరు చేర్చుకున్నప్పుడు కూడా వారు కుక్కలు, నక్కలేనా? సీఎంగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు రైతుల కష్టాలు గుర్తుకొచ్చాయా?’ అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
AP: పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘1వ తేదీన పెన్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ నెపాన్ని టీడీపీ, ఎన్నికల సంఘంపై నెడుతున్నారు. పెన్షన్లు పంపిణీ చేయొద్దని టీడీపీ ఎవరినీ కోరలేదు. వైసీపీ కుట్రలను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలి. ఖజానా ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు’ అని విమర్శించారు.
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.68.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద టిల్లన్న డామినేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా ఈ మూవీ వచ్చింది.
Sorry, no posts matched your criteria.