news

News September 19, 2024

ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

image

తనను నెట్టింట ట్రోల్ చేస్తున్న ఓ వ్యక్తిపై చర్యల్ని కోరుతూ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కోల్‌కతా పోలీసుల్ని ఆశ్రయించారు. ‘మృణ్మయ్ దాస్ అనే వ్యక్తి నన్ను లక్ష్యంగా చేసుకుని దూషిస్తూ కించపరిచే వ్యాఖ్యలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. దయచేసి వెంటనే అతడిపై చర్యలు తీసుకోండి’ అని గంగూలీ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

News September 19, 2024

‘కూలీ’ మూవీ సీన్ లీక్‌పై డైరెక్టర్ రియాక్షన్

image

‘కూలీ’ మూవీ సీన్ లీక్ అవ్వడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ‘ఒక్క రికార్డింగ్‌తో రెండు నెలలుగా మేం పడ్డ కష్టం వృథా అయింది. ఇలాంటివి ప్రోత్సహించొద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫైట్ సీన్‌లో నాగార్జున ఉన్న వీడియోను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

News September 19, 2024

అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

News September 19, 2024

జానీ మాస్టర్‌‌ది లవ్ జిహాదీనే: కరాటే కళ్యాణి

image

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సినీ నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. ‘జానీ మాస్టర్‌ది కచ్చితంగా లవ్ జిహాదీ కేసే. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. నిందితుడిగా తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏమిటి? బాధితురాలికి అందరూ అండగా నిలవాలి’ అని ఆమె పేర్కొన్నారు.

News September 19, 2024

ఒకప్పుడు టమాటాను విషం అనుకునేవారు!

image

పలు పాశ్చాత్య దేశాల్లో ఒకప్పుడు టమాటాను విషంగా భావించి భయపడేవారు. అవి తినడం వల్ల చాలామంది కన్నుమూయడమే అందుక్కారణం. మరణ భయంతో దానికి పాయిజన్ యాపిల్ అని పేరు కూడా పెట్టారు. సుమారు 200 ఏళ్ల పాటు ఈ నమ్మకమే ఉండేది. అయితే, ప్రజలు వాడుతున్న ప్యూటర్(pewter) ప్లేట్లలో లెడ్ సారం ప్రమాదకర స్థాయుల్లో ఉంటోందని, టమాటాల్లోని ఆమ్లంతో కలిసి వారి మరణాలకు దారి తీస్తోందని తర్వాత గుర్తించారు.

News September 19, 2024

అఫ్గానిస్థాన్ సంచలనం

image

వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. దక్షిణాఫ్రికాపై తొలి సారి విజయం సాధించింది. యూఏఈలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి అఫ్గాన్ రికార్డు సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 107 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 26 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

News September 19, 2024

నేను త్వరగా రిటైర్ అయ్యానేమో: ఫెదరర్

image

తాను త్వరగా రిటైర్ అయిపోయానని తనకు తరచూ అనిపిస్తుంటుందని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. టెన్నిస్ కోర్టుకు వచ్చినప్పుడల్లా తాను ఇంకా ఆడగలనని అనుకుంటానని పేర్కొన్నారు. ‘నాలో ఇంకా ఆట ఉంది. కానీ ఇంట్లో ఉండటం సౌకర్యంగా ఉంది. టూర్లు తిరగనవసరం లేదన్న విషయం గుర్తొచ్చినప్పుడు రిలీఫ్‌గా ఉంటుంది’ అని వెల్లడించారు. తన తోటి దిగ్గజం నాదల్ రిటైర్మెంట్‌పై అంచనా వేయలేనని స్పష్టం చేశారు.

News September 19, 2024

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD అదనపు ఈవో

image

AP: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించే గరుడ వాహన సేవ ఏర్పాట్లపై TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. ఆ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయం(OCT 4-12)లో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. OCT 7న ఉ.6 గంటల నుంచి కొండపైకి బైకుల్ని నిలిపివేస్తామని, తిరిగి 9వ తేదీన ఉ.6 గం.కు అనుమతిస్తామన్నారు.

News September 18, 2024

తక్కువసేపు నిద్ర పోతున్నారా?

image

ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాం. తక్కువసేపు నిద్రపోతే మానసిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి క్షీణించటం, ఏకాగ్రత కోల్పోవడం, బరువు పెరగడం, కోపం ముంచుకురావడం, నిరుత్సాహం ఆవరించడం, పనితీరు తగ్గడం, డ్రైవింగ్‌లో ప్రమాదాలకు గురికావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం, ఒత్తిడి పెరగడం, గుండె సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు.

News September 18, 2024

లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు

image

లెబనాన్‌లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.