news

News May 4, 2024

వచ్చే వారం రైతులకు నష్ట పరిహారం!

image

TG: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేవారం నుంచి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ సేకరించిన రైతుల వివరాల ఆధారంగా రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈసీ అనుమతితో ఫండ్స్ రిలీజ్‌కు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం.

News May 4, 2024

పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి గడువు పెంచాలి: టీచర్ సంఘాలు

image

APలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి గడువు పొడిగించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ECని కోరాయి. ఈ నెల 5న నీట్ పరీక్ష, ఎన్నికల ట్రైనింగ్ ఉన్న కారణంగా పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. అటు మహిళా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా పక్క నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించాలని, ఫాం-12 దరఖాస్తులు ఇవ్వలేని ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలని కోరాయి.

News May 4, 2024

తెలంగాణలో కొత్తగా మరో రెండు క్లస్టర్లు

image

TG: మరింత స్పష్టంగా వాతావరణ సూచనలు ఇచ్చేందుకు IMD రాష్ట్రంలో మరో 2 కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లూ.. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అదనంగా 2 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. తూర్పు(10 జిల్లాలు), పశ్చిమం(4), దక్షిణం(5), ఉత్తర(9), మధ్య తెలంగాణ(5)లుగా విభజించింది. ఆగ్రో క్లైమేటిక్ పరిస్థితుల ఆధారంగా ఈ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News May 4, 2024

ఈ సీజన్‌లో ఇదే తొలి సారి

image

ముంబై, కోల్‌కతా మధ్య మ్యాచులో చెత్త ఫీట్ చోటు చేసుకుంది. ఒకే మ్యాచులో ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్‌లో ఓకే మ్యాచులో రెండు టీమ్స్ ఆలౌటైన తొలి మ్యాచుగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇలా నాలుగు సార్లు జరిగింది. 2010లో DCvsRR, 2017లో KKRvsRCB, 2018లో MIvsSRH మ్యాచుల్లో రెండు జట్లు ఆలౌటయ్యాయి.

News May 4, 2024

‘కన్నప్ప’కి బాలీవుడ్ నటుడు బై బై

image

‘కన్నప్ప’ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తైంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ఆయనకు వీడ్కోలు పలికింది. అక్షయ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని.. ఈ ప్రయాణం ఎంతో విలువైనదని హీరో మంచు విష్ణు అన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News May 4, 2024

‘దోస్త్’.. ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

image

TG: రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు <<13172421>>‘దోస్త్’<<>> నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసం ఆన్‌లైన్‌లో రూ.200 ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించింది. మొత్తం 1,066 డిగ్రీ కళాశాలల్లో 4,49,449 సీట్లు భర్తీ చేయనుంది. విద్యార్థులు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

News May 4, 2024

ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం ఎక్కడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన నాలుగు చోట్ల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట కార్నర్ మీటింగ్, 6:30 గంటలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్‌లకు హాజరు కానున్నారు.

News May 4, 2024

పోలీసుల వాదన తప్పు: రోహిత్ సోదరుడు

image

TG: రోహిత్ వేముల కేసులో పోలీసుల <<13173448>>ప్రకటన<<>>పై అతని సోదరుడు రాజా అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల వాదన తప్పని అన్నారు. ఒక వ్యక్తి కులాన్ని పోలీసు అధికారి నిర్ణయించలేడని.. ఈ అంశంపై సీఎం రేవంత్‌ను కలుస్తామని చెప్పారు. దీనిపై అవసరమైతే పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

News May 4, 2024

ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..

image

AP: ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పలమనేరులో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత 3 గంటలకు నెల్లూరులో జరిగే సభలో పాల్గొంటారు.

News May 4, 2024

ఆ కారణంతోనే ఓటు వేయలేదు: జ్యోతిక

image

ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై నటి జ్యోతిక వివరణ ఇచ్చారు. ‘గత కొన్నేళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. కొన్ని సార్లు అత్యవసరమైతే చెన్నైలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈ సారి నేను అనారోగ్యంతో ఉన్నారు. అది నా వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు’ అని చెప్పారు. జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.