news

News March 23, 2024

అడుగంటుతోన్న రిజర్వాయర్లు

image

దేశవ్యాప్తంగా నీటి కొరత తారస్థాయికి చేరింది. 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 38 శాతానికి పడిపోయాయి. దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నిల్వలు అత్యల్పంగా 23 శాతానికి చేరాయి. 150 జలాశయాల నిల్వ సామర్థ్యం 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్లు(BCM) కాగా ప్రస్తుతం 67.591 BCM నీరు మాత్రమే ఉంది. వేసవి ముగిసే సమయానికి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

News March 23, 2024

భార్యకు శిరోముండనం చేసిన భర్త

image

AP: విశాఖలో అమానుష ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెకు శిరోముండనం చేశాడో భర్త. అనకాపల్లి PSలో శంకర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా భార్య మహాలక్ష్మి రూ.2.5లక్షల అప్పు చేసింది. డబ్బిచ్చిన వారు తిరిగి ఇమ్మని ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో ఆ డబ్బు ఏ ప్రియుడికి ఇచ్చావంటూ శంకర్ ఆమెపై దాడి చేశాడు. గుండు గీసి.. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

News March 23, 2024

IPLలో ధోనీ మరో రికార్డు

image

సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో రికార్డు నమోదు చేశారు. అత్యధిక రనౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనుజ్ రావత్‌ను రనౌట్ చేశారు. దీంతో ఆయన ఇప్పటివరకు 42 మందిని రనౌట్ చేశారు. అలాగే 138 క్యాచ్‌లు పట్టారు. ఓవరాల్‌గా 180 మందిని ఔట్ చేశారు. ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్ (169), సాహా (106), రాబిన్ ఉతప్ప (90), పార్థివ్ పటేల్ (81) ఉన్నారు.

News March 23, 2024

ఢిల్లీ లిక్కర్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు లింకు: రాజ్‌దీప్

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు ఆసక్తికర సంబంధం ఉందని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. ‘ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి NOV 11, 2022న అరెస్టయ్యారు. 4 రోజుల తర్వాత అరబిందో ఫార్మా నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹5 కోట్లు BJPకి వెళ్లాయి. గత ఏడాది మేలో శరత్ బెయిల్ పిటిషన్‌కు ED అభ్యంతరం చెప్పలేదు. జూన్ 2న ఆయన రిలీజయ్యారు. NOVలో ₹25 కోట్లు BJPకి చేరాయి’ అని పేర్కొన్నారు.

News March 23, 2024

నిప్పుల కొలిమిలా రెంటచింతల

image

AP: పల్నాడు జిల్లా రెంటచింతలలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఏటా వేసవిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో రెంటచింతల ఒకటి.

News March 23, 2024

వారంలో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్‌లో 4.97 లక్షల మంది రైతుల నుంచి 29.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 4.36 లక్షల మంది రైతులకు రూ.5,700 కోట్లు చెల్లించామంది. మిగిలిన 61 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.838 కోట్లను వారం రోజుల్లో జమ చేస్తామని తెలిపింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లు ప్రారంభిస్తామని, 25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

News March 23, 2024

ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి హామీ పథకం

image

AP: ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి హామీ చట్టం వర్తింపజేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు కూడా ఉపాధి హామీ వర్తింంపజేయాలని భావించింది. దీంతో వెంటనే కేంద్రానికి విన్నవించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్‌ను ఒక కుటుంబంగా గుర్తించి జాబ్ కార్డు ఇవ్వనున్నారు. ఐదుగురు హిజ్రాలు ఉంటే వారిని ప్రత్యేక గ్రూపుగా పరిగణించనున్నారు. పని స్థలంలో వారిని ఎవరూ వెకిలిగా కించపరచకూడదు.

News March 23, 2024

SOMIREDDY: వరుసగా 5 సార్లు ఓడినా మళ్లీ టికెట్

image

AP: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా 5 సార్లు ఓడినా మళ్లీ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆయనకు ఆరోసారి టికెట్ కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సర్వేపల్లి నుంచి ఆయన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. 2012లో కోవూరు ఉపఎన్నికలో కూడా ఓడిపోయారు. సోమిరెడ్డి గెలుపు రుచి చూడక రెండు దశాబ్దాలు గడిచినా ఆరోసారి టికెట్ సాధించుకున్నారు.

News March 23, 2024

కవితకు బెయిల్ వస్తుందా?

image

TG: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవితను ఈ నెల 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

News March 23, 2024

మూల్యం చెల్లించుకుంటారు.. పుతిన్ వార్నింగ్

image

మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఘటన వెనుక ఎవరున్నా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. మరోవైపు ఉగ్రదాడిని అమెరికా, ఐక్యరాజ్య సమితి, ఈయూ ఖండించాయి. అయితే ఉగ్రదాడి జరగొచ్చని వారం క్రితమే రష్యాలోని అమెరికా ఎంబసీ హెచ్చరించడం గమనార్హం.