India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. 50 ఏళ్లలో ఇదే అత్యంత సుదీర్ఘ గ్రహణం. ఆ రోజున రా.9.12 నుంచి అర్ధరాత్రి 1.25 వరకు కొనసాగనుంది. మన దేశంలో ఎక్కువగా కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. భూమి, సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు వృద్ధుడైపోతున్నారని, ఆయనకు ఓటు వేయొద్దని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. కొడుకును పైకి తీసుకురావడం, రిటైర్మెంట్‌కు డబ్బు సంపాదించడం ఆయన ఎజెండా. ఆంధ్రుల కలల్ని ఆయన ఎలా నెరవేరుస్తాడు? ఏపీకి స్థిరమైన యువ నేత కావాలి’ అని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీకి మధ్య ఎప్పుడూ సమన్వయం ఉండదని.. ఒక కుటుంబమే బాగుపడుతుందని విమర్శించారు.
జూన్‌లో జరిగే T20 WCలో వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై BCCI దృష్టి సారించింది. ఈ స్థానం కోసం KL రాహుల్, పంత్, జురెల్, శాంసన్, జితేశ్ పోటీ పడుతున్నారు. ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌లో ఉన్నవారిని తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారట. పంత్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కానీ అతను తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. IPLలో ప్రదర్శన ఆధారంగానే WK ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తోంది.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనను పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అతను హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం అతని పిటిషన్‌ను కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది.
IPL-2024లో ఈసారి ఓవర్‌కు రెండు షార్ట్ బాల్స్(బౌన్సర్)ను అనుమతించనున్నారు. గత సీజన్ వరకు ఓవర్‌కు ఒక బౌన్సర్ మాత్రమే వేయాలనే రూల్ ఉండేది. అలాగే స్టంపింగ్ కోసం థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేసినప్పుడు ముందుగా క్యాచ్‌ను చెక్ చేసే రూల్‌ను కొనసాగించనున్నారు. ఔట్, నాటౌట్‌తో పాటు వైడ్, నో బాల్ కోసం ఒక్కో టీమ్‌కు రెండు రివ్యూలను కంటిన్యూ చేయనున్నారు. ఇటీవల ICC తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్‌ను అమలు చేయడం లేదు.
TG: కానిస్టేబుల్ అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటివారంలో శిక్షణ ప్రారంభించేలా అనువైన మైదానాలు, అభ్యర్థుల బస వంటి ఏర్పాట్లపై దృష్టి సారించారు. సివిల్, ఏఆర్, SPF విభాగాల కానిస్టేబుళ్ల శిక్షణ గత నెలలో ప్రారంభించగా.. త్వరలోనే TSSP విభాగం శిక్షణ ప్రారంభం కానుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభపడి 72,854 వద్ద, నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 22068 వద్ద ట్రేడవుతున్నాయి. BPCL, NTPC, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందాల్‌కో షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం, ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని సూచనలు వచ్చిన నేపథ్యంలో మార్కెట్లకు జోష్ వచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.
TG: గృహాజ్యోతి పథకానికి అర్హులై ఉండి, జీరో బిల్లు రాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో ఈ స్పెషల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించింది. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
భారత ప్రజలకు సుప్రీంకోర్టు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు CJI జస్టిస్ చంద్రచూడ్. కులం, మతం, లింగం, హోదాలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు ముందు ఏ కేసూ చిన్నది కాదని స్పష్టం చేశారు. సామాన్యులు న్యాయం కోసం మొదట జిల్లా కోర్టును ఆశ్రయిస్తారని అందుకే వాటిని సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 150 మంది జిల్లా కోర్టు జడ్జిలతో సమావేశమైనట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.