news

News March 20, 2024

సీఏపై నారీమణుల ఆసక్తి

image

ఛార్టర్డ్ అకౌంటెంట్లుగా మహిళలు సత్తా చాటుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం 8శాతంగా ఉన్న వీరు ప్రస్తుతం 30శాతానికి పెరిగారు. ఇప్పుడు 8.63 లక్షల మంది CA విద్యార్థులుండగా వారిలో 43 శాతం ఆడవారే ఉన్నారు. కోర్సును చేసేందుకు ఉన్న సౌలభ్యం, చదివేందుకు అయ్యే ఖర్చు అందుబాటులో ఉండటం ప్రధాన ఆకర్షణలుగా మారాయి. కోర్సు పూర్తి చేసినవారికి భారీగా జీతభత్యాలు ఉండటం గమనార్హం.

News March 20, 2024

ఘోరం: వివాహితను ప్రేమించాడని..

image

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అమానవీయ ఘటన జరిగింది. వివాహితను ప్రేమించాడని ఓ యువకుడితో కొందరు యూరిన్ తాగించారు. దారుణంగా కొట్టి నాలుకతో షూస్ నాకించారు. అంతటితో ఆగకుండా యువకుడికి సగం గుండు, మీసం తీయించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన స్థానిక ఏఎస్పీ నితేశ్ భార్గవ బాధితుడి ఇంటికి వెళ్లగా అతడు అందుబాటులో లేడు. త్వరలోనే బాధితుడిని కలిసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

News March 20, 2024

రాజ్ ఠాక్రే ఎంట్రీతో బీజేపీకి బలం చేకూరేనా?

image

400 లోక్‌సభ సీట్లే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకుంటున్న BJP మహారాష్ట్రలో ‘ఠాక్రే’ బ్రాండ్‌పై కన్నేసింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)తో ఉన్న కూటమిలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (MNS)ను ఆహ్వానించింది. ఆ పార్టీ కలిస్తే BJPకి మరింత బలం చేకూరుతుందంటున్నారు విశ్లేషకులు. 2006లో విభేదాల వల్ల శివసేన నుంచి వైదొలగిన రాజ్ ఠాక్రే MNS స్థాపించారు.

News March 20, 2024

‘UBER’కు రూ.20వేల ఫైన్!

image

బుక్ చేసే సమయంలో చూపిన ఛార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసినందుకు UBER కంపెనీకి కన్జూమర్ కోర్టు రూ.20వేల జరిమానా విధించింది. చండీగఢ్‌కు చెందిన ప్రశార్ 2021 ఆగస్టు 6న ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. 8.83కిలో మీటర్లకు రూ.359 చూపించగా.. గమ్యం చేరే సమయానికి రూ.1334కి చేరుకుంది. అతడి ఫిర్యాదును విచారించిన కోర్టు కస్టమర్ ఖాతాలో పదివేలు, లీగల్ ఎయిడ్ ఖాతాలో పదివేలు జమచేయాలని ఆదేశించింది.

News March 20, 2024

నా పేరు కోహ్లీకి తెలుసు: శ్రేయాంక

image

యూత్ క్రష్ శ్రేయాంక పాటిల్ తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిసి సంతోషం వ్యక్తం చేశారు. ‘అతడి వల్లే క్రికెట్ చూడటం ప్రారంభించా. విరాట్‌లా ఉండాలని కలలు కంటూ పెరిగా. గత రాత్రి అతడిని కలిసిన క్షణం నా జీవితంతో మరిచిపోలేనిది. విరాట్.. హాయ్ శ్రేయాంక అని పలకరించారు. బాగా బౌలింగ్ చేశానని ప్రశంసించారు. నిజానికి నా పేరు కోహ్లీకి తెలుసు’ అంటూ శ్రేయాంక ట్వీట్ చేశారు.

News March 20, 2024

వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్

image

TG: రాష్ట్రంలో ప్రస్తుతం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తున్నదని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని తెలిపారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News March 20, 2024

బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ రాజీనామా

image

TG: బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని చెప్పారు. సతీశ్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

News March 20, 2024

‘కృత్రిమ మామిడిపండ్ల’ ముఠా అరెస్ట్

image

వేసవి వచ్చేసింది. రోడ్ల పక్కన, మార్కెట్లలో మామిడిపండ్ల విక్రయం కూడా మొదలైంది. అయితే వాటిలో అన్నీ ప్రకృతి సిద్ధంగా మగ్గినవి కావని గుర్తుంచుకోండి. తాజాగా హైదరాబాద్‌‌లోని బషీర్‌బాగ్ పోలీసులు మామిడికాయలను కృత్రిమంగా మగ్గపెడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.12లక్షల విలువైన మామిడిపండ్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. మీరూ మామిడిపండ్లు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి.

News March 20, 2024

అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు అల్లు అర్జున్ దరఖాస్తు

image

పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కి వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు.

News March 20, 2024

ఉస్తాద్ భగత్‌సింగ్‌పై CEO కీలక వ్యాఖ్యలు

image

AP: DSC నిర్వహణపై విద్యాశాఖ వివరణ కోరామని CEO ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు తెలిపారు. DSC నిర్వహణపై CECకి లేఖ రాస్తామన్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే EC అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.