India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళలో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని.. ఈ తేదీలు ముస్లింలకు ఎంతో పవిత్రమైన శుక్రవారం వస్తున్నాయని, ఆ రోజుల్లో పోలింగ్ వద్దని కోరింది. మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంటుందని.. అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.
AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.
టీమ్ ఇండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆయన ఆడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మింజ్ బైక్ ప్రమాదంలో గాయపడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో సర్ఫరాజ్‌ను తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు టాక్. కాగా ఐపీఎల్ మినీ వేలంలో సర్ఫరాజ్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.
TS: MLC కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న తొలిరోజు విచారణ అనంతరం ఆమె భర్తతో పాటు KTR, హరీశ్‌రావు కలిశారు. ఇవాళ పలువురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది కలిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,23,092 మంది విద్యార్థులు, తెలంగాణలో 5.08 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు 5 నిమిషాల(ఉ.9.35 వరకు) గ్రేస్ పీరియడ్ ఇవ్వగా.. ఏపీలో లేదు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
TG: రాష్ట్రంలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీ ఇచ్చారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్‌కు ఎదురు లేకుండా పోయింది. తాజా విజయంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
TG: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనుండగా.. సభ ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ పర్యవేక్షిస్తున్నారు.
AP: శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. అలాగే మడకశిర అభ్యర్థి ఈర లక్కప్ప ఉపాధి కూలీ. ఆయన ఇప్పటికీ పక్కా గృహంలో నివసిస్తున్నారు. మరోవైపు మైలవరం అభ్యర్థిగా ప్రకటించిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు. 2021లో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు.
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కాబోతుంది. చెన్నైలో జరిగే తొలి మ్యాచ్ టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒకరు రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.1700 నుంచి రూ.7500 వరకు ఉన్నాయి. పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం కానుంది.
Sorry, no posts matched your criteria.