news

News April 5, 2024

‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’

image

ఉప్పల్ స్టేడియంలో ధోనీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్స్ ఆఫ్ ఇండియా’ అంటూ ఇద్దరి ఫొటోలతో పోస్టర్ క్రియేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఒకరు ఐసీసీ ట్రోఫీల కింగ్.. మరొకరు బాక్సాఫీస్ కింగ్’ అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ధోనీ-తారక్ ఫొటోలతో మరో పోస్టర్‌ను యంగ్ టైగర్ ఫ్యాన్స్ ప్రదర్శించారు.

News April 5, 2024

దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు: KCR

image

తెలంగాణలో 2014కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. ‘మేం కరీంనగర్ జిల్లాకు నాలుగైదు జలధారలు సృష్టించాం. అవి ఇప్పుడు ఎండిపోయాయి. గోదావరి ఎడారిగా మారింది. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం, అసమర్థత వల్లే కరవు వచ్చింది. 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయింది. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు. వర్షాలు లేకపోవడం వల్లే కరవు వచ్చిందని చెబుతున్నారు. అది అబద్ధం’ అని మండిపడ్డారు.

News April 5, 2024

నా పెళ్లిపై ట్రోల్స్ పట్టించుకోను: దిల్ రాజు

image

తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ పట్టించుకోనని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘నా పెళ్లి తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నా భార్య చూసి నాకు చెప్పింది. నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటే.. విమర్శించేవారు పది వేల మంది కూడా ఉండరు. నేను ఆకాశం లాంటి వాడిని.. మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి.. ఆ తర్వాత ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 5, 2024

BREAKING: వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా

image

AP: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇక్బాల్ TDPలో చేరనున్నట్లు సమాచారం. ఈయన 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అక్కడ దీపికను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

News April 5, 2024

ప్రచారాస్త్రంగా సోషల్ మీడియా

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు నిర్విరామంగా ప్రచారం చేస్తున్నాయి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్ వంటి సోషల్ మీడియా వేదికలను ప్రచారానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా క్రియేటివ్ కంటెంట్‌తో ప్రచారం చేస్తున్నాయి. ఈ వేదికలు ఓటర్ సైకాలజీని ప్రభావితం చేసే మాధ్యమాలుగా ఉద్భవించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News April 5, 2024

T20WCకి మయాంక్ యాదవ్‌ను తీసుకోవాలి: మనోజ్ తివారీ

image

IPLలో అదరగొడుతోన్న ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రానున్న T20WC కోసం షమీ, బుమ్రా తర్వాత మూడో పేసర్‌గా ఇతడిని తీసుకోవాలని మనోజ్ తివారీ BCCIకి సూచించారు. ‘నేను చీఫ్ సెలక్టర్‌గా ఉంటే మయాంక్‌ను ఎంపిక చేస్తా. అతని యాక్షన్, నియంత్రణతో కూడిన బౌలింగ్ అద్భుతంగా ఉంది. పెద్ద టోర్నీల్లో అవకాశం ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.

News April 5, 2024

గ్రాండ్‌గా అమలాపాల్ సీమంతం

image

హీరోయిన్ అమలాపాల్ సీమంతం గ్రాండ్‌గా జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఫంక్షన్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమలాపాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా అమలాపాల్ తొలుత డైరెక్టర్ విజయ్‌ను పెళ్లాడారు. మూడేళ్లకే మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జగత్ దేశాయ్‌ను ప్రేమించి గతేడాది వివాహం చేసుకున్నారు.

News April 5, 2024

ఘోరం: బైక్ ఫైనాన్స్ చెల్లించలేదని రాళ్లతో కొట్టారు

image

TG: ఖమ్మంలో ఫైనాన్స్ ఏజెంట్లు దారుణానికి తెగబడ్డారు. బైక్ ఫైనాన్స్ కట్టలేదని వినయ్ అనే యువకుడిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అతను పరిగెత్తుతూ ప్రమాదవశాత్తు ఖానాపురం మినీ ట్యాంక్ బండ్‌లో పడి దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమైన మోహన్ సాయి ఫైనాన్స్‌కు చెందిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

తండ్రి మృతి.. హీరోయిన్ ఎమోషనల్ పోస్టు

image

తన తండ్రి జోసెఫ్ ఫిలిప్ <<12989731>>మృతిపై<<>> హీరోయిన్ మీరా జాస్మిన్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులతో కలిసి దిగిన పాత ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘మనమంతా మళ్లీ కలిసే వరకు ఎదురుచూస్తూనే ఉంటా’ అనే అర్థంలో లవ్ సింబల్‌తో పోస్టు రాసుకొచ్చారు. తండ్రి అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.

News April 5, 2024

పాడేరు.. పట్టం కట్టేదెవరికి?

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు(ST) నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 5సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, BSP, జనతా పార్టీ చెరోసారి గెలిచాయి. ఈసారి సిట్టింగ్‌ MLA భాగ్యలక్ష్మిని కాదని విశ్వేశ్వరరాజును YCP బరిలో దింపింది. టీడీపీ నుంచి వెంకట రమేశ్ నాయుడు పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కలిసొస్తాయని విశ్వేశ్వరరాజు ధీమాగా ఉండగా, తనకు గెలుపు ఖాయమని రమేశ్ చెబుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

error: Content is protected !!