news

News June 12, 2024

ఏపీ మంత్రివర్గ జాబితా ఇదే(1/2)

image

AP: 24 మందితో మంత్రివర్గ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 3, బీజేపీకి ఒక పదవి కేటాయించారు.
✒ పవన్ కళ్యాణ్, ✒ నారా లోకేశ్
✒ అచ్చెన్నాయుడు, ✒ కొల్లు రవీంద్ర,
✒ నాదెండ్ల మనోహర్(JSP), ✒ పి.నారాయణ,
✒ వంగలపూడి అనిత, ✒ సత్యకుమార్ యాదవ్(BJP)
✒ నిమ్మల రామా నాయుడు ✒ మహమ్మద్ ఫరూక్
✒ ఆనం రాంనారాయణ రెడ్డి, ✒ పయ్యావుల కేశవ్

News June 12, 2024

జూన్ 12: చరిత్రలో ఈరోజు

image

✒ 1930: సినీ గేయ రచయిత అచ్చి వేణుగోపాలాచార్యులు జననం.
✒ 1964: దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించారు.
✒ 1975: హీరో గోపీచంద్ జననం.
✒ 1999: ఏపీ మాజీ సీఎం జలగం వెంగళరావు మరణం.
✒ 2017: సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి మరణం.
✒ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.

News June 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 12, 2024

కేంద్ర మంత్రులంతా కుబేరులే

image

PM మోదీ సారథ్యంలో 71 మందితో కొలువుదీరిన కేబినెట్‌లో 99% మంది కోటీశ్వరులేనని ADR వెల్లడించింది. వారి సగటు ఆస్తి ₹108 కోట్లని తెలిపింది. APకి చెందిన P.చంద్రశేఖర్(గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి) ఆస్తి అత్యధికంగా ₹5,705 కోట్లని చెప్పింది. జ్యోతిరాదిత్య-₹424 కోట్లు, అశ్వినీ వైష్ణవ్ ₹144 కోట్లు, ఇంద్రజిత్-₹121 కోట్లు, కుమారస్వామి-₹115 కోట్లు, గోయల్-₹110 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంది.

News June 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 12, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 12, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:53 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు
ఇష: రాత్రి 8.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 12, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 12, బుధవారం
జ్యేష్ఠమాసం
శు.షష్ఠి: రాత్రి 7.17 గంటలకు
మఖ: అర్ధరాత్రి 2:12 గంటలకు
దుర్ముహూర్తం: ఉ.11:41 నుంచి మ.12:33 వరకు
వర్జ్యం: మ.12.55 నుంచి మ.2.41 వరకు

News June 12, 2024

TODAY HEADLINES

image

* రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
* విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా
* TG: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌కు నోటీసులు
* ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు: మంత్రి రాజనర్సింహ
* సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసులకు వయోపరిమితి పెంపు
* ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ
* విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా మృతి

News June 12, 2024

₹300 జువెల్లరీ ₹6కోట్లకు అంటగట్టారు!

image

రాజస్థాన్‌లోని జోహ్రీ బజార్‌లో ఓ జువెల్లరీ షాపు ఓనర్లు ఓ US మహిళకు కుచ్చుటోపీ పెట్టారు. చెరిష్ అనే మహిళకు ₹300 ఆభరణానికి బంగారు పాలిష్‌ వేసి ₹6కోట్లకు రెండేళ్ల కిందట విక్రయించారు. నమ్మించేందుకు హాల్‌మార్క్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్‌లో ఆభరణాన్ని తాజాగా ప్రదర్శించగా అది నకిలీదని తేలింది. ఆమె ఫిర్యాదుతో జైపూర్ పోలీసులు వ్యాపారులైన తండ్రి, కొడుకుపై కేసు నమోదు చేశారు.

News June 12, 2024

ఆ విషయంలో బీజేపీ తీరు మారదు: గౌరవ్ గొగొయ్

image

ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలో బీజేపీ తీరు మారదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ విమర్శించారు. ఈ సారి విపక్ష కూటమికి బలం పెరగడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీడియాతో పేర్కొన్నారు. గత ఏడాది 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, ఈ సారి 230 మందిని సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు.