news

News November 30, 2024

వేళ్లను విరవడం మంచిదా? కాదా?

image

వేళ్లను <<14753262>>విరవడం<<>> వల్ల నష్టం ఉందా? అనే దానిపై భిన్న వాదనలున్నాయి. సైంటిస్ట్ డోనాల్డ్ ఉంగర్ ఒకే చేతి వేళ్లను 60ఏళ్లు విరిచారు. అయినా ఎలాంటి దుష్ప్రభావం లేదని తేల్చారు. అయితే ఇష్టారీతిన లేదా తరచుగా విరవడం మంచిది కాదని, అలా చేయడం వల్ల ఎముక స్థానభ్రంశం చెందే ప్రమాదం కొందరు వైద్యులు అంటున్నారు. దీని వల్ల వేళ్లలో బలం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. కానీ, దానిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగలేదు.

News November 30, 2024

క్షీణించిన శిండే ఆరోగ్యం

image

మహారాష్ట్ర ఆపద్ధర్మ CM ఏక్‌నాథ్ శిండే ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఆయన ఇన్‌ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డెంగ్యూ, మలేరియా నెగటివ్ వచ్చాయన్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తూ మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. కాగా రానున్న 24 గంటల్లో మహా సీఎంపై శిండే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని శివసేన నేత శిర్సత్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ వార్త బయటికి రావడం గమనార్హం.

News November 30, 2024

EVM ఓట్లలో తేడా ఉంది కానీ ఆధారాల్లేవు: శరద్ పవార్

image

EVMల పనితీరుపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సందేహాలు వ్యక్తం చేశారు. వాటిలో నమోదు చేసిన ఓట్లలో తేడాలున్నాయని ఆరోపించారు. ‘ఓట్లలో కచ్చితంగా ఏదో తేడా కనిపిస్తోంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలేవీ ప్రస్తుతానికి నావద్ద లేవు. కొంతమంది రీకౌంటింగ్‌కి డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. కేంద్రంలోని NDA సర్కారు కారణంగా మహారాష్ట్ర ప్రజల్లో ఎన్నికలు ఆందోళన కలిగించాయి’ అని వ్యాఖ్యానించారు.

News November 30, 2024

రేవంత్.. ఏ రైతును బెదిరిస్తున్నావు?: హరీశ్‌

image

TG: MBNRలో రైతు పండుగ పేరుతో CM రేవంత్ మరోసారి రైతులను మోసం చేశారని BRS నేత హరీశ్‌రావు అన్నారు. ‘నీ ప్రసంగం చూస్తే రైతులపై ప్రేమ కంటే గిరిజనుల నుంచి భూసేకరణలో విఫలమయ్యాననే ఆవేదనే కనిపించింది.. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని అంటున్నావు. పాలమూరు సాక్షిగా ఏ రైతును బెదిరిస్తున్నావు? అప్పుడు దేవుళ్లపై ఒట్టేసి మాట తప్పావు ఇప్పుడు నీ మంత్రులపై ఒట్టేశావు’ అని హరీశ్ ట్వీట్ చేశారు.

News November 30, 2024

నదీ జలాల్లో రాష్ట్ర వాటాలను దక్కించుకోవాలి: CM రేవంత్

image

TG: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర వాటాలను దక్కించుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. అందుకోసం అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల అధికారులు, న్యాయ నిపుణులకు సూచించారు. ఇవాళ CM రేవంత్, మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖపై సమీక్షించారు.

News November 30, 2024

మహారాష్ట్ర CM ఆ పార్టీ నుంచే: అజిత్ పవార్

image

మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు మాజీ Dy.CM అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చారు. BJP నుంచే సీఎంగా ప్రమాణం చేస్తారని చెప్పారు. శివసేన, NCPలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయన్నారు. ‘మహాయుతి’ నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో జరిపిన సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కావడం కొత్తేం కాదని, 1999లో నెల పట్టిందని ఆయన గుర్తుచేశారు. వారం రోజులుగా మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

News November 30, 2024

నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. FIR నమోదు

image

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు శరద్ కపూర్‌పై FIR నమోదైంది. ఓ ప్రాజెక్ట్‌ విషయమై ఈనెల 26న ఆయన తనను ఇంటికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని 32 ఏళ్ల మహిళ ముంబైలోని ఖర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో శరద్ కపూర్‌పై BNS 4, 75, 79 సెక్షన్ల కింద FIR నమోదు చేసి, విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కాగా శరద్ కపూర్ జోష్, కార్గిల్ LOC, లక్ష్య తదితర చిత్రాల్లో నటించారు.

News November 30, 2024

మెంతికూరను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే..

image

విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభించే మెంతికూరను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం తేలికే. ఆకుల్ని ఏరి 3-4 టైమ్స్ బాగా కడిగి క్లాత్‌లో ఆరబెట్టుకోవాలి. తర్వాత గాలి చొరబడని కంటెయినర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. క్లీన్‌చేసిన ఆకుల్ని కత్తిరించి జిప్‌లాక్ బ్యాగులో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టడం మరోపద్ధతి. మెంతిని కడగకుండా కాడలతో పేపర్లో చుట్టి 13 రోజులు స్టోర్ చేయొచ్చు.

News November 30, 2024

జీవో 317పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

TG: జీవో 317పై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ 243, 244, 245 ఉత్తర్వుల్లో పేర్కొంది. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సర్కార్ మార్గదర్శకాల్లో సూచించింది.

News November 30, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

ఖాతాదారులకు EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ శుభవార్త చెప్పింది. ఇకపై క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేసే తేదీ వరకూ చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సెటిల్‌మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అమల్లో ఉంది. దీంతో ఖాతాదారుడికి ఆర్థికంగా నష్టం జరుగుతోందన్న ఫిర్యాదులు రావడంతో ఇవాళ్టి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.