India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.

సగటు తెలుగు సినిమా అభిమానులకు దర్శకుడు వి.వి.వినాయక్ పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్లతో ఆయన సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్‌తో ఉన్న ఫొటోలో ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై జట్టును వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోహిత్ గనుక వేలంలో పాల్గొంటే మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పారు. అతడిని దక్కించుకునేందుకు ఏ జట్టు అత్యధికంగా బిడ్ వేస్తుందో చూడాలని ఉందన్నారు. రోహిత్‌లో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఆయన భారీ ధర పలకడం ఖాయమని జోస్యం చెప్పారు.

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. దీనిలో భాగంగా ఇవాళ 28 స్కూళ్లకు ఒకేసారి శంకుస్థాపన జరగనుంది. రంగారెడ్డిలోని షాద్‌నగర్ వద్ద సీఎం రేవంత్, మధిరలో డిప్యూటీ సీఎం ఈ కాంప్లెక్సులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది.

AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్‌కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఈ నెల 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.

ఈ సీజన్‌లో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఇమ్యూనిటీని పెంచే గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. డిప్రెషన్‌కు లోనవ్వకుండా చేయడమే కాకుండా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతాయని చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.