India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రముఖ నటుడు, ఎంపీ సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాజాగా 8వ జాబితా విడుదల చేసిన ఆ పార్టీ.. సన్నీకి టికెట్‌ను నిరాకరించింది. ప్రస్తుతం ఆయన గుర్దాస్‌పుర్ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయనను కాదని దినేశ్ సింగ్ బబ్బూకు టికెట్ ఇచ్చింది. మరోవైపు మాజీ దౌత్యవేత్త తరంజిత్ సంధూను అమృత్‌సర్ నుంచి బీజేపీ బరిలో నిలిపింది.

తమ శాఖ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మొబైల్ యూజర్లకు టెలికాం శాఖ సూచించింది. సైబర్ నేరగాళ్లు విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి మొబైల్ నంబర్ నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, వ్యక్తిగత డేటా దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్, 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.

యూట్యూబర్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌పై మరో కేసు నమోదైంది. ఓ వీడియోలో నిషేధిత పాములను వాడినందుకు అతడిపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పాము విషం విక్రయం కేసులో అతడు 5రోజులు జైలు జీవితం గడిపారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇప్పుడు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ సౌరభ్ గుప్తా ఫిర్యాదుతో మరోసారి కేసు నమోదైంది.

TG: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వారు పాల్గొంటారు. రాష్ట్రంలో మిగిలిన 4 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు జరుపుతారు. నాలుగు రోజుల క్రితమే వీరు ఢిల్లీ వెళ్లి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన విషయం తెలిసిందే.

AP: వాలంటీర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయం బాధాకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ నిర్ణయంపై ఈసీ పునరాలోచన చేయాలని కోరారు. ‘ఈసీ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడతారు. చంద్రబాబు, పవన్ వాలంటీర్ల సేవలను ప్రశంసించాల్సింది పోయి.. అడ్డుకుంటున్నారు. జగన్‌పై కక్షతో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి కుట్రలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డికాక్(54) హాఫ్ సెంచరీ చేయగా కెప్టెన్ పూరన్(42) రాణించారు. చివర్లో కృణాల్ పాండ్య(43) మెరుపులతో లక్నో జట్టు 20 ఓవర్లలో 199/8 స్కోర్ నమోదు చేసింది. సామ్ కరన్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, రబాడ, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.

ప్రపంచ దేశాల జనాభాపై లాన్సెట్ జర్నల్ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. 25ఏళ్లలో 155 దేశాలు/టెర్రిటరీల్లో జనాభా గణనీయంగా పడిపోనుందని పరిశోధకులు తెలిపారు. 2100కు ఆ దేశాల సంఖ్య 198కు చేరడమే కాక జననాల రేటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండనుందట. ఈ నేపథ్యంలో రానున్న మార్పులు ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

TG: జూనియర్ కాలేజీల 2024-25 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఫస్ట్, సెకండియర్ తరగతులు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 6-13 వరకు దసరా సెలవులు, నవంబర్ 18-23 వరకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్, 2025 జనవరి 11-16 వరకు సంక్రాంతి సెలవులుంటాయి. జనవరి 20-25 వరకు ప్రీఫైనల్స్, ఫిబ్రవరి తొలివారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలుంటాయని బోర్డు వెల్లడించింది.

నిమిషాల వ్యవధిలో పుట్టిన వాళ్లను కవలలు అంటాం. అయితే ENGలో డోయల్ అనే మహిళకు ఓ బిడ్డ పుట్టి చనిపోయిన 22 రోజులకు మరో శిశువు జన్మించింది. ఇది అరుదైన సంఘటన అని, కవలలు ఇంత గ్యాప్‌లో జన్మించడం చూడలేదని వైద్యులు తెలిపారు. ‘బొడ్డు తాడులో రక్తం గడ్డకట్టి మొదటి శిశువు చనిపోయింది. తర్వాత నొప్పులు రాకపోవడంతో ఇంటికి పంపాం. 22 రోజులకు పెయిన్స్ రావడంతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాం’ అని పేర్కొన్నారు.

AP: రేపు బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ప్రకటించారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా నాలుగు రోజుల క్రితం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన సీఎం బస్సు యాత్ర.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.