India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దివంగత కోలీవుడ్ కమెడియన్ వివేక్ కూతురు తేజస్విని వివాహం భరత్ అనే యువకుడితో చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. తండ్రికి గుర్తుగా ఆమె మొక్కలు నాటారు. అలాగే అతిథులకు దంపతులిద్దరూ మొక్కలను పంపిణీ చేశారు. ప్రకృతిలో తమ తండ్రిని చూసుకునేందుకే ఈ పని చేసినట్లు తేజస్విని వెల్లడించారు. కరోనాతో 2021లో వివేక్ మరణించిన విషయం తెలిసిందే.

KKR స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇవాళ ఆర్సీబీతో జరిగే మ్యాచులో ఆయన 500 టీ20లు ఆడిన ఏకైక స్పిన్నర్‌గా నిలవనున్నారు. ఈ కరేబియన్ ప్లేయర్ ఐపీఎల్‌తో పాటు పలు లీగ్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న మూడో ప్లేయర్‌గా నరైన్ రికార్డులకెక్కనున్నారు. డ్వేన్ బ్రావో(573), షోయబ్ మాలిక్(542) ఈ జాబితాలో ముందున్నారు.

MP, MLA అభ్యర్థులు ఎన్నికల్లో తాము చేసిన ఖర్చును ECకి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిపై అనర్హత వేటు పడుతుంది. ఈ కారణంతో ఒక్క నిజామాబాద్‌లో ఏకంగా 72మందిపై వేటు పడింది. పసుపు బోర్డు విషయంలో నిరసనగా 2019లో నామినేషన్ వేసిన రైతులు ఖర్చుల వివరాలు ఇవ్వలేదు. ఈసారి అనర్హతకు గురైన 1,069మంది గత ఎన్నికల్లో ఖర్చు వివరాలు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 51 మంది, తెలంగాణలో 107 మంది అనర్హతకు గురయ్యారు.

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వసూలి టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా తదితర నేతలు క్రికెట్ ప్లేయర్లుగా ఉన్న పోస్టర్‌ను ఆమె ఇన్‌స్టా స్టోరీ పెట్టినట్లు ట్వీట్లు చేస్తున్నాయి. వస్త్రాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తున్నాయి. మరోవైపు ఆమె ఇన్‌స్టా హ్యాక్ అయి ఉండొచ్చని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

TG: రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. బాధతోనే బీఆర్ఎస్‌ను వీడుతున్నానని, తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచనున్నారు. రేపటి నుంచి 10 నియోజకవర్గాల్లో ఆయన భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరం సభల్లో పవన్ ప్రసంగిస్తారు.

వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలవుతున్నామని బాధపడే రైతులను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే.. అదే వ్యవసాయంలో కొందరు వినూత్న ఆలోచనలతో విజయాలు సాధిస్తున్నారు. ఏడాదికి రూ.7.5కోట్లు సంపాదిస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ కోవకే చెందుతారు. ఇంతకీ ఎవరీ సోదరులు, ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఇక్కడ <

తెలంగాణను రీడిస్కవర్ చేయాలని KCR ఇచ్చిన పిలుపును ఎప్పటికీ తక్కువగా అంచనా వేయకూడదని ఆ పార్టీ సీనియర్ నేత కేకే అన్నారు. ఈరోజు తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటానికి కారణం KCR అని పేర్కొన్నారు. ఇంత చేసినప్పటికీ పార్టీ ఓడటం ఊహించనిదని అన్నారు. కుటుంబ పాలన అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని, పార్టీని నడిపించేందుకు తలసాని వంటి కొందరి పేర్లు తాను ప్రతిపాదించినా వినలేదని కేకే అన్నారు.

AP: ఎంపీ రఘురామకృష్ణ రాజు టికెట్‌పై అనిశ్చితి నెలకొంది. ఆయనకు టికెట్ కేటాయించాలని కూటమి పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆయనను ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే టీడీపీ మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుని అసెంబ్లీ లేదా ఎంపీ సీటు ఆయనకు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా ఎంతోమందిని రోడ్డున పడేసింది. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల జెస్సీ అగర్వాల్ కూడా కోవిడ్ సమయంలో IT జాబ్ కోల్పోయింది. దీంతో ఆమె దొంగగా మారింది. పేయింగ్ గెస్టుల నుంచి ల్యాప్‌టాప్‌లు కొట్టేసి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసేది. ఓ పేయింగ్ గెస్ట్ ఫిర్యాదుతో జెస్సీ బండారం బయటపడింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.10 లక్షల విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.