India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

KKRతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ జట్టు 20 ఓవర్లలో 153/9 స్కోర్ చేసింది. రిషభ్ పంత్ 27, అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీషా 13, ఫ్రేజర్ 12 రన్స్ చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చివర్లో 35 పరుగులు చేసి టీమ్‌ను ఆదుకున్నారు. వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ 2, నరైన్, స్టార్క్ చెరో వికెట్ తీశారు.

AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. 40-44 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రేపు 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 90 మండలాల్లో తీవ్ర వడగాలులు, 202 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. తీవ్రతను బట్టి పలు మండలాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ మండలాల జాబితాను ఇక్కడ <

AP: ప్రజల జీవితాలను సీఎం జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. నందికొట్కూరు సభలో మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కు శిక్ష వేసే బాధ్యత ప్రజలదే. డ్రైవింగ్ తెలియని వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. ఆయనకు సంపద సృష్టించడం తెలియదు. వైసీపీ హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేమీ లేవు’ అని మండిపడ్డారు.

AP: జనసేనకు, కూటమి నేతలకు గ్లాస్ సింబల్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటి వరకు రెబల్స్, ఇండిపెండెంట్లు కలిపి 14 మందికి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. రెబల్స్ సుధాకర్(కావలి),మీసాల గీత(విజయనగరం), సూర్యచంద్ర(జగ్గంపేట), రాప్తాడు, విజయవాడ ఎంపీ స్థానాల్లో నవతరం పార్టీకి, మదనపల్లె, చంద్రగిరి, శ్రీకాళహస్తి, కమలాపురంలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 1, 5వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. మే 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. మే 5న నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా కంపెనీ తొలిసారిగా అంగీకరించింది. వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకేలో పలువురు కోర్టుకెక్కారు. రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ‘అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చు’ అని ఆస్ట్రాజెనెకా కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ ‘కొవిషీల్డ్’ పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది.

AP: స్కూళ్లలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫొటో పెట్టడమేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఐదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న వ్యక్తి బొమ్మ పుస్తకాలపై పెట్టడమేంటి? జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారు. పిల్లలకు ఇచ్చే చిక్కీ కవర్లపై రూ.67 కోట్ల కొట్టేసిన వ్యక్తి జగన్. ఆయన హయాంలో పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక దోపిడీలే ఉన్నాయి. వైసీపీ ఓటమి తథ్యం’ అని గణపవరం సభలో పవన్ విమర్శించారు.

ట్విటర్‌లో CricTracker అనే పేజీ నిర్వహించిన పోల్‌లో ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచారు. ధోనీ రెండో స్థానం పొందారు. మొత్తం 8 మంది పేర్లతో (ధోనీ, రోహిత్, గంభీర్, వార్నర్, వార్న్, కోహ్లీ, గిల్‌క్రిస్ట్, విలియమ్‌సన్) ఈ పోటీని నిర్వహించారు. కామెంట్స్ ఆధారంగా ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు. చివరగా రోహిత్ విజేతగా నిలిచారు. వీరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

AP: పిఠాపురంలో ఎన్నికల నియమావళిని అధికారులు మార్చే ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఆరోపించింది. ‘తెలుగు జాతీయ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పెద్దంశెట్టి వెంకటేశ్వరరావుకి గ్లాస్ గుర్తుని పోలిన పెన్ స్టాండ్ గుర్తు ఇవ్వాలని చూస్తున్నారు. ఆ గుర్తు కోసం ఆయన దరఖాస్తు చేసినట్లు పత్రాలు జత చేశారు. పవన్‌కు పడే ఓట్లను పెన్ స్టాండ్ గుర్తుకు బదలాయించే కుట్ర జరుగుతోందని అనుమానాలొస్తున్నాయి’ అని ట్వీట్ చేసింది.

మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలతో నీచ రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు. SC, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన చెప్పినట్లుగా ఎడిట్ చేసిన ఓ వీడియోపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.