India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబై 26/11 బాంబు పేలుళ్ల ఘటనలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(SPP)గా వాదనలు వినిపించిన ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆయన్ని ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలో నిలిపింది. ఈ స్థానం నుంచి బీజేపీ నేత మహాజన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నికమ్.. 1993 ముంబై బాంబు పేలుళ్లు, గుల్షన్ హత్య, ప్రమోద్ మహజన్ కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి అలుపెరగకుండా శ్రమించారు.

AP: నేరాలు, ఘోరాలు చేయడంలో సీఎం జగన్ పీహెచ్‌డీ చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘వైసీపీ పాలనలో రాష్ట్రం రాతియుగంలోకి పోయింది. వైసీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టో ఎంతో బెటర్. మేనిఫెస్టోలో రైతుల గురించి ఒక్క పథకం కూడా లేదు. జగన్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కూటమి గెలిస్తే అభివృద్ధి.. వైసీపీ గెలిస్తే అరాచకం వస్తుంది. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్’ అని ఆయన పేర్కొన్నారు.

TG: రాజ్యాంగాన్ని మార్చేందుకు BJP కుట్రలు చేస్తుంటే KCR స్పందించరా? అని CM రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘BRS, BJPవి కుమ్మక్కు రాజకీయాలు. మల్కాజ్‌గిరిలో BJPని గెలిపిస్తామని MLA మల్లారెడ్డి అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోరా? 5 నియోజకవర్గాల్లో BJPకి BRS మద్దతిస్తోంది. నేను రుణమాఫీ చేస్తానని చెప్పగానే భూములు అమ్మవద్దని ఈటల కండీషన్లు పెడుతున్నారు. గతంలో KCR అమ్ముతుంటే ఎందుకు మాట్లాడలేదు?’ అని ధ్వజమెత్తారు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన రికార్డును నమోదు చేసింది. 20 ఓవర్లలో 257/4 రన్స్ చేసిన DC.. ఐపీఎల్‌లో తమ జట్టు తరఫున అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇప్పటివరకు 2011లో చేసిన 231/4 రన్స్ మాత్రమే DCకి అత్యధికం కాగా.. ఇవాళ్టి మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఒకానొక దశలో DC 270 రన్స్ చేసేలా కనిపించినా.. వికెట్లు కోల్పోవడంతో 257/4 రన్స్‌కే పరిమితం అయ్యింది.

హార్దిక్ పాండ్యను ఓ సూపర్ స్టార్‌లా చూడటం బీసీసీఐ మానుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ హితవు పలికారు. క్రమం తప్పకుండా చక్కటి ప్రదర్శన ఇస్తే తప్ప అతడిని కీలక ఆటగాడిగా పరిగణించొద్దని తేల్చిచెప్పారు. ‘నువ్వు అద్భుతమైన ఆల్‌రౌండర్ అని భావిస్తే అంతర్జాతీయ స్థాయిలో నీ ప్రదర్శన కూడా ఆస్థాయిలో ఉండాలి. హార్దిక్ విషయంలో తనకున్న నైపుణ్యంపై చర్చే తప్ప అది ప్రదర్శనగా మారట్లేదు’ అని పేర్కొన్నారు.

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

TG: రిజర్వేషన్లను ఎత్తేసేందుకు BJP కుట్ర చేస్తోందని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోంది. అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు ఉపయోగించుకుని 400 సీట్లు గెలవాలనుకుంటోంది. అక్రమంగా, దౌర్జన్యంగా గెలవాలని ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు’ అని CM ఫైర్ అయ్యారు.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 రన్స్ చేశారు. ఫ్రేజర్-మెక్‌గుర్క్ (84) విధ్వంసానికి తోడు స్టబ్స్(48*) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. హోప్(41), పోరెల్(36), పంత్(29) రాణించారు.

కర్ణాటకలోని హనూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇండిగనత్త గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేవని గ్రామస్థులు అధికారులను నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఈ నెల 29న ఆ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు EC ప్రకటించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ వీర విహారం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ల్యూక్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో ఊచకోత కోశారు. వరుసగా 4, 4, 6, 4, 4, 4 బాదారు. దీంతో ఒకే ఓవర్‌లో 26 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ స్కోర్ 18.1 ఓవర్లకు 235/4గా ఉంది.
Sorry, no posts matched your criteria.