news

News April 4, 2024

‘జీరో’ అయిన బైజూస్ హీరో

image

భారతదేశపు ఎడ్‌టెక్ దిగ్గజం ‘బైజూస్’ వ్యవస్థాపకుడు రవీంద్రన్ జీరోకి పడిపోయారు. అతడి నెట్‌వర్త్ రూ.17,545కోట్ల నుంచి సున్నాకి మారిందని ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్‌లో వెల్లడైంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ పెరగడంతో బైజూస్ ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ సంస్థగా నిలిచిన బైజూస్ మనీలాండరింగ్ ఆరోపణలతో ఇటీవల తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది.

News April 4, 2024

కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కౌంటర్

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొదని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కౌంటర్ పిటిషన్ వేసింది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందన్న ఈడీ.. ఈ కేసులో మరికొందరిని ప్రశ్నిస్తున్నామని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోరింది. ఈడీ కౌంటర్‌కు రీజాయిండర్ వేసేందుకు కవిత లాయర్లు సమయం కోరారు. ఈ కేసులో గత నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

News April 4, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఫేక్ న్యూస్.. స్పందించిన EC

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయలేరని ఓ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుండగా.. దీనిపై EC స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది.

News April 4, 2024

ప్రముఖ కెమెరామెన్ మృతి

image

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌కి కెమెరామెన్‌గా పనిచేసిన పోతన వెంకటరమణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించారు. బుుతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు వంటి హిట్ సీరియల్స్‌కి కెమెరామెన్‌గా పనిచేసిన ఆయన.. శ్రీ వైనతేయ అనే సీరియల్‌కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పలు సినిమాలకు పనిచేశారు.

News April 4, 2024

కండువా మారిస్తే అంతా క్లీన్! – 1/2

image

BJPలోకి ఫిరాయించిన నేతలకు సంబంధించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. IE వివరాల ప్రకారం.. 2014 నుంచి ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది బడా పొలిటీషియన్లు BJPలో చేరారు. వీరిలో 10 మంది కాంగ్రెస్ నుంచి.. NCP, శివసేన నుంచి చెరో నలుగురు ఉన్నారు. TMC నుంచి ముగ్గురు, TDP నుంచి ఇద్దరు.. సమాజ్‌వాదీ పార్టీ, YCP నుంచి చెరొకరు బీజేపీలో చేరారు.
<<-se>>#Elections2024<<>>

News April 4, 2024

కండువా మారిస్తే అంతా క్లీన్! – 2/2

image

ఈ లిస్ట్‌లోని 23 మందిలో ముగ్గురి కేసులు క్లోజ్ కాగా మరో 20 మంది కేసులు మూలనపడినట్లు IE వెల్లడించింది. ‘2014లో శారదా స్కామ్ కేసులో CBI దాడులు ఎదుర్కొన్న హిమంత బిశ్వ శర్మ (అస్సాం ప్రస్తుత సీఎం) 2015లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత కేసు ఫైల్ కదలలేదు. బెంగాల్‌లో సువేందు అధికారి, మహారాష్ట్రలో BJPతో చేతులు కలిపిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ విషయంలోనూ ఇదే జరిగింది’ అని పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>

News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ప్రణీత్‌రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. BJP నేతలు బీఎల్ సంతోష్, తుషార్‌లకు నోటీసులు ఇచ్చేందుకు BRS నేతకు చెందిన విమానంలో అప్పటి సిట్ అధికారులు ఢిల్లీ, కేరళ వెళ్లినట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News April 4, 2024

అవనిగడ్డ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

image

AP: కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పాలకొండ అభ్యర్థిని 2 రోజుల్లో ప్రకటించనున్న ఆయన.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు చేయనున్నారు. టీడీపీకి చెందిన బుద్ధప్రసాద్ ఇటీవలే జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

News April 4, 2024

CM కేజ్రీవాల్‌కు ఊరట

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు కోర్టులో ఊరట లభించింది. జైలులో ఉన్న ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కేజ్రీవాల్‌కు కలిగింది.

News April 4, 2024

నాతో రేప్ సీన్ చేయనని హీరోయిన్ ఏడ్చింది: రంజిత్

image

అలనాటి నటి మాధురీ దీక్షిత్ తనతో రేప్ సీన్‌లో నటించలేనని బోరున ఏడ్చేశారని వెటరన్ యాక్టర్ రంజిత్ వెల్లడించారు. 1989లో వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ప్రేమ్ ప్రతిజ్ఞ’లో మిథున్ చక్రవర్తి, మాధురి జంటగా నటించారు. ఈ సినిమాలో రంజిత్ హీరోయిన్‌ను తోపుడు బండిపై రేప్ చేసే సీన్ ఉంటుంది. అయితే.. ఆ సీన్ చేయమని డైరెక్టర్ అడగ్గా.. మాధురి ఏడ్చి, ఆ సీన్‌లో నటించలేనని వేడుకున్నారట. బతిమాలితే చివరికి ఒప్పుకున్నారట.