news

News March 26, 2024

BRSకు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మదన్ రెడ్డి?

image

TG: బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సన్నిహితుడు మదన్ రెడ్డి ఇవాళ మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు. రేపోమాపో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారట.

News March 26, 2024

యాక్షన్ షూట్‌లో ‘మిస్టర్ బచ్చన్’

image

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ‘యాక్షన్ టైమ్ ఫర్ మిస్టర్ బచ్చన్’ అని పేర్కొన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News March 26, 2024

వారి సినిమాల్లో లాజిక్‌లు చూడొద్దు: నాగవంశీ

image

పెద్ద హీరోల సినిమాలకు లాజిక్‌లతో పనిలేదని నిర్మాత నాగవంశీ అన్నారు. వారి సినిమాల్లో ఎలివేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలన్నారు. సలార్‌లో ప్రభాస్‌ను చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తే.. కొందరు మాత్రం సన్నివేశాల్లో లాజిక్ లేదని కామెంట్లు చేశారు. గుంటూరు కారంలో హీరో హైదరాబాద్ వెళ్లి రావడంపై రకరకాల కామెంట్స్ చేశారని అన్నారు. తీరా ఓటీటీలోకి వచ్చాక సినిమా బాగుందని మెసేజ్‌లు పెట్టారన్నారు.

News March 26, 2024

ఈడీ ముందుకు కవిత మేనల్లుడు!

image

TG: ఓ వైపు కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ కస్టడీ విధించగా.. మరోవైపు ఈడీ విచారణ కొనసాగిస్తోంది. కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఈడీ విచారిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో నగదు బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇదే కేసులో అదుపులోకి తీసుకొని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

News March 26, 2024

సీనియర్ నటి రాధిక ఆస్తుల విలువ ఎంతంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో BJP తరఫున బరిలోకి దిగుతున్న సీనియర్ నటి రాధిక నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన ఆస్తుల విలువ రూ.53.45 కోట్లుగా ప్రకటించారు. 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రూ.26.40 కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఆమె తమిళనాడులోని విరుదునగర్ నుంచి బరిలో ఉన్నారు.

News March 26, 2024

5 టెస్టులతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ

image

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఇక నుంచి ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ కోసం షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు సుమారు రెండు నెలలపాటు అక్కడే గడపనుంది. నవంబర్ 22వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత్-ఆసీస్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.

News March 26, 2024

గ్రూప్-1 దరఖాస్తుల్లో ఎడిట్‌కు రేపే లాస్ట్ డేట్

image

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో ఎడిట్‌ చేసుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. గ్రూప్-1కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.
వెబ్‌సైట్: <>https://www.tspsc.gov.in/<<>>

News March 26, 2024

యువతుల అక్రమ రవాణా కేసులో అమెరికన్ సింగర్

image

యువతుల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో అమెరికన్ ప్రముఖ ర్యాపర్ సీన్ కాంబ్స్(డిడ్డీ పేరుతో ప్రసిద్ధి)పై కేసు నమోదైంది. అతనిపై పలువురు మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా వంటి ఆరోపణలు చేశారు. దీంతో అతని ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతని ప్రియురాలు కాసాండ్రా 2016లో డిడ్డీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసేవాడని పేర్కొన్నారు.

News March 26, 2024

UPSC పరీక్షల పేరుతో సమయం వృథా చేసుకుంటున్నారు: ఆర్థికవేత్త

image

సివిల్ సర్వీసెస్ మోజులో చాలా మంది యువత తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ తెలిపారు. ‘దేశానికి బ్యూరోక్రసీ అవసరమే. కానీ ఆ పోస్టుల కోసం లక్షల మంది ఏళ్ల తరబడి ప్రిపేర్ కావడం సరికాదు. అదే కృషిని మరో రంగంలో కనబరిస్తే గొప్ప వైద్యులో, దర్శకులో, శాస్త్రవేత్తలో వచ్చేవారు. నిజంగా అడ్మినిస్ట్రేషన్ మీద ఆసక్తి ఉన్న వారు మాత్రమే UPSCకి సన్నద్ధం కావాలి’ అని పేర్కొన్నారు.

News March 26, 2024

అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో?

image

AP: అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి ఎంపికపై TDPలో స్పష్టత కొరవడింది. సామాజిక, ఆర్థిక సమీకరణాలు లెక్కలతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా మాజీ MP జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి పేరు టికెట్ రేసులో వినిపిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో బోయ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, రాజేష్, మాజీ ZP ఛైర్మన్ పూల నాగరాజు పేర్లను పరిశీలిస్తున్నారు.