news

News March 28, 2024

స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు జోరు కనబరుస్తున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 830 పాయింట్లు తాకి 73,826కు చేరింది. మరోవైపు నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 22,370కు చేరింది. రియల్టీ మినహా ఇతర ప్రధాన రంగాలన్నీ 0.5-1శాతం లాభాలతో ట్రేడవడం మార్కెట్‌కు కలిసొచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, హీరోమోటోకార్ప్, JSWస్టీల్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

News March 28, 2024

జర్మనీ తగ్గింది.. అమెరికా తగ్గనంటోంది!

image

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌ను పారదర్శకంగా విచారిస్తారని ఆశిస్తున్నామంటూ జర్మనీ, అమెరికాలు కామెంట్ చేసి కేంద్రం నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలను పిలిచి కేంద్రం నిలదీసింది. దీంతో జర్మనీ వెనక్కి తగ్గింది. భారత రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని పేర్కొంది. అయితే US మాత్రం గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఈ కేసు విచారణను సమగ్రంగా పరిశీలిస్తామని మరోసారి కామెంట్ చేసింది.

News March 28, 2024

ఉత్తరాంధ్రలో ఈ సీట్లపై వీడని పీటముడి

image

AP: చీపురుపల్లి, భీమిలి TDP MLA అభ్యర్థుల ఎంపిక పీటముడిగా మారింది. మాజీ మంత్రి గంటా చీపురుపల్లిలో పోటీ చేస్తే భీమిలిలో కళా వెంకట్రావు, నెల్లిమర్ల TDP ఇన్‌ఛార్జ్ బంగార్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంటా చీపురుపల్లిలో పోటీ చేయకుంటే అక్కడ కళా వెంకట్రావు, కిమిడి నాగార్జునలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. విజయనగరం MP స్థానానికీ వెంకట్రావు, నాగార్జున, బంగార్రాజు, గీత పేర్లు వినిపిస్తున్నాయి.

News March 28, 2024

కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగిస్తారా?

image

ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ ED కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ మ.2 గంటలకు ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరే అవకాశాలున్నాయి. లేదంటే ఆయనను రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 3కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో MLC కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

News March 28, 2024

అర్జెంటీనాలో 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కట్!

image

ఓవైపు టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తుంటే అర్జెంటీనాలో ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఈ ముప్పు వెంటాడనుంది. ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలెయ్ 70వేల మందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు పలు ప్రభుత్వ కార్యక్రమాలకు నిధులు నిలిపివేస్తున్నామని.. 2లక్షలకుపైగా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతే ఇందుకు కారణమట. కాగా అక్కడ 35లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

News March 28, 2024

రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు?

image

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టికి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో బైక్ మీద నుంచి జారి పడటంతో చేతికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెంటనే ఆస్పత్రిలో చికిత్స అందించారని, రెండు నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంపై నవీన్ టీమ్ స్పందించాల్సి ఉంది.

News March 28, 2024

సీఎం సహా ఐదుగురు ఏకగ్రీవం!

image

అరుణాచల్‌ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు BJP ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియగా ఆయా స్థానాల్లో BJP నేతలు మినహా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వారి ఎన్నికను ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో ఏప్రిల్ 19న 55 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగనుంది.

News March 28, 2024

2019లో భారీ మెజార్టీ.. ఇప్పుడు ఆత్మహత్య

image

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి(77) <<12940065>>ఆత్మహత్య<<>> ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2019 ఎన్నికల్లో ఆయన DMK నుంచి పోటీ చేసి 2.10 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాటం చేసి ఇవాళ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.

News March 28, 2024

పెళ్లింట ఘోర విషాదం

image

TS: రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాన్‌పల్లిలో నిన్న పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మరణించారు. బంధువులు ప్రమాదంలో చనిపోవడంతో పెళ్లి నిలిచిపోయింది. పెళ్లి ఆగిందన్న మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 28, 2024

రూ.7.50 లక్షల కోట్ల అప్పునకు కేంద్రం ప్రణాళికలు

image

APR-SEPలో సెక్యూరిటీ బాండ్ల ద్వారా భారీగా రుణ సమీకరణకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024-25కు స్థూల మార్కెట్ రుణ అంచనాలు ₹14.13 లక్షల కోట్లు కాగా, తొలి 6 నెలలకు అందులో 53% లేదా ₹7.50 లక్షల కోట్లు తీసుకోనుంది. రెవెన్యూ లోటును పూడ్చడం, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 3, 5, 7, 10, 15, 30, 40, 50 ఏళ్ల కాలపరిమితితో నిధులు సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.