India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుదిజాబిత, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇతర ఎన్నికలకు సంబంధించి సమాచారం, సందేహాలకు
కంట్రోల్ రూమ్ టూల్ ఫ్రీ నంబర్ సంప్రదించవచ్చన్నారు. 1800425193 నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

దేవి నిమజ్జన మహోత్సవంలో మహిళల కోసం 30 మంది మహిళా పోలీసు సిబ్బందిచే పటిష్టమైన షీ టీం బృందంతో బందోబస్త్ ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని పొందవచ్చని సూచించారు. నవరాత్రి నిమజ్జన ఉత్సవాలలో డీజేలకు అనుమతులు లేదని తెలిపారు.

ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ఈ దసరా అందరికీ విజయాలను చేకూర్చాలని ఆకాంక్షించారు.

నేడు జరగనున్న దుర్గా నవరాత్రి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 80 దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. 200 మంది పోలీసు సిబ్బందితో కూడిన బృందాన్ని 9 సెక్టార్లుగా, 4 క్లస్టర్లుగా విభజించి, సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. జూలైలో జరిగిన మొదటి, రెండో, మూడో సంవత్సరం (ఓల్డ్ బ్యాచ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల కోసం విద్యార్థులు https://braou.ac.in/#gsc.tab=0 వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

ద్విచక్ర వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ రుక్మారెడ్డిని ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన ఓ యువకుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే ఆరోపణతో ఆదిలాబాద్‌లోని వినాయక చౌక్ వద్ద రుక్మారెడ్డి అతనిపై దాడి చేసిన ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.

మహిళల రక్షణకై షీ టీంలు జిల్లాలో పనిచేస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలం అందూనాయక్ తండాలో ఆయన పర్యటించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జ్వాలాముఖి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులతో కలసి దాండియా ఆడారు. అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాజల్ సింగ్, రాంసింగ్ మహారాజ్, ఎస్సై సాయన్న, ఉన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కలిసి ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లా కలెక్టర్లతో జిల్లాస్థాయి అత్యవసర వీసీ సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ వారికి వివరించారు.

ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలక వివరాలు ఖరారయ్యాయి. జిల్లాలో మొత్తం 473 గ్రామ పంచాయతీలు (GP) ఉండగా, వీటి పరిధిలో 3,870 వార్డులు ఉన్నాయి. జిల్లా పరిషత్ స్థానాలు (ZPTC) 20 కాగా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (MPTC) 166గా నిర్ధారించారు. స్థానిక ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది.

ప్రజల ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.