India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదివాసీల జానపదమైన గుస్సాడి నృత్యానికి వన్నె తెచ్చిన శ్రీ కనకరాజు మరణం బాధాకరమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ తరాలకు అందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఎర్రకోట వేదికగా గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన మరణం తీరని లోటని వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు, X లో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గతంలో SIగా విధులు నిర్వహించిన WSI సోనియా, ASI మను ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ సస్పెండ్ అయ్యారు. సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై SP శ్రీనివాస్ విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 IG చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
భైంసా మండల కేంద్రంలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 4 వరకు జరిగే పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్ ఐడీ కార్డుతో హాజరు కావాలని సూచించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహిత గుస్సాడి కనక రాజు పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నామని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ సుగుణ తెలిపారు. శనివారం మార్లవాయిలో కనకరాజు పార్థివ దేహానికి ఆమె నివాళులర్పించారు. కనకరాజు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సుగుణ తెలిపారు.
కడెం ప్రాజెక్టు వద్ద కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పెద్దూరు గ్రామానికి చెందిన గోపు మల్లేశ్ అనే వ్యక్తి గొర్రెల మందను మేతకి కడెం ప్రాజెక్టు కింది వైపు వెళ్లాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న కాలువ ఒడ్డు నుంచి కొండచిలువ గొర్రెపై దాడి చేసి హతమార్చింది. అక్కడికి చేరుకున్న కాపరి కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. ఓ వ్యక్తి బండరాయి విసరడంతో కొండచిలువ నీళ్లలోకి పారిపోయింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆదివాసీ గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనక రాజు మృతి చెందడం బాధాకరం అన్నారు. గుస్సాడీ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన మరణం సమాజానికి తీరని లోటు అని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో దేవాలయాలపై జరిగిన దాడికి నిరసనగా నిర్మల్ జిల్లా ముధోల్ మండల ఉత్సవ కమిటీ, హిందూ వాహిని అధ్వర్యంలో నేడు ముధోల్ బంద్ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు రోళ్ల రమేశ్ తెలిపారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు.
ఆసిఫాబాద్: పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు నేడు స్వగ్రామం జైనూర్ మండలం మర్లవాయిలో జరగనున్నాయి. శుక్రవారం అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా.. పలువురు సంతాపం తెలిపారు. ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అలరించే ఆయన ఈసారి పండగ ముందే కన్నుమూయడంతో ఆదివాసీ గూడేల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి వన్నెతెచ్చిన కనగరాజును 2021లో ‘పద్మశ్రీ’ వరించింది.
పద్మశ్రీ కనకరాజు గుస్సాడి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు గుస్సాడి నృత్యం శిక్షణలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. కేంద్రం ప్రభుత్వం కనకరాజును 2021 పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మరణం ఆదివాసులకు తీరని లోటుగా మిగిలిపోనుంది. రేపు అంతక్రియలు ఆయన స్వగృహంలో నిర్వహిస్తున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కారుకు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారుకు స్వల్పంగా డ్యామేజ్ అయింది. కాగా ఎమ్మెల్యే అతి స్వల్పంగా గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
Sorry, no posts matched your criteria.