India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
ఆంద్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒకరు దుర్మరణం చెందారు. గుడిహత్నూర్ మండలం మన్నూర్‌కు చెందిన బాలుముండే అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే ఐచర్ వాహనంలో అమరావతి నుండి చెన్నై సంత్ర పండ్ల లోడ్‌తో వెళుతుండగా ఒంగోలు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలు ముండే దుర్మరణం చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 25న రామక్రిష్ణాపూర్ తిలక్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు SGF జిల్లా కార్యదర్శి బాబురావు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్- 19 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపిక పోటీలకు ఇంటర్ చదువుతూ 19 ఏళ్ల లోపు విద్యార్థులు అర్హులని తెలిపారు.
జల్ జంగల్ జమీన్ నినాదంతో నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ వీరుడు కొమరం భీమ్. ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలపై నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన కొదమ సింహం, చరిత్ర మరువని యోధుడు కొమురం భీం. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసులను ఏకం చేసి హక్కుల కోసం పోరాటం చేసిన మహా నాయకుడు. నేటికీ కుమరం భీమ్ ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కుల సాధనకై పోరాటాలు కొనసాగిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IBచౌరస్తాలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ ‘మంచి మంచిర్యాల’ అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గతంలో పట్టణ ప్రగతి నిధులు కేటాయించి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ‘మంచి మంచిర్యాల’ అక్షరాలు కనిపించకుండా పోయాయి. దీంతో సెల్ఫీ పాయింట్ బోసిపోయి కనిపిస్తోంది. వెంటనే అక్షరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఎంపీ నగేష్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులు అత్యధిక శాతంగా జిల్లాకు వచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఈనెల 24వ తేదీన ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి రజని కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న 18- 30 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశం పొందాలని కోరారు.
ఆసిఫాబాద్ మండలంలోని అడ ప్రాజెక్టు వద్ద గల లేక్ వ్యూ రెస్టారెంట్ నడపడానికి ఆసక్తి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్హత కలిగిన గిరిజన అభ్యర్థులు ఈనెల 28 వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకై దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తెలిపారు. జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, బుగ్గారం, ఆసిఫాబాద్, ఇచ్చోడ, జైనూర్, తిర్యాణి, సిర్పూర్, ముథోల్‌లోని పాఠశాలల్లో మిగిలిన సీట్లకై అర్హులైన విద్యార్థులు ఉట్నూరులోని గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలం రేణుకాపూర్ చెరువులో ఆదివారం లభ్యమైంది. స్థానిక ఎస్సై గణేశ్ వివరాల మేరకు.. అటుగా వెళ్తున్న స్థానికులు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతదేహం గుర్తుపట్టే విధంగా లేకపోవడంతో విచారణ జరిపి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.