Adilabad

News April 2, 2026

ఇసుక రవాణాలో పారదర్శకత పాటించాలి: ADB కలెక్టర్

image

జిల్లాలో ఇసుక రవాణా పారదర్శకంగా సాగాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మన ఇసుక – వాహనం’ పోర్టల్ పనితీరు, ఇసుక నిల్వలను సమీక్షించారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్ పాల్గొన్నారు.

News April 2, 2026

ADB: తొలిరోజు JEE ప్రశాంతం.. ఏడుగురు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్‌లలో పరీక్ష జరిగింది. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 80 మంది విద్యార్థులకు గాను 73 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్ పున్నారవ్ తెలిపారు. మధ్యాహ్నం కూడా ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు.

News April 2, 2026

ఈనెల 5న అధికారికంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

ఈనెల 5న బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి మహోత్సవాన్ని ఆదిలాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తునట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు బాబూ జగ్జీవన్ చౌక్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలల అలంకరణ కార్యక్రమం, ఆ తర్వాత ఎస్టీయూ భవనంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరై మహనీయుని జయంతి విజయవంతం చేయాలని కోరారు.

News April 2, 2026

ఆదిలాబాద్: సైన్స్ పరీక్షకు 23 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. గురువారం సైన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 52 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10907 మంది విద్యార్థులకు గాను 10884 మంది విద్యార్థులు హాజరై 23 మంది గైర్హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.

News April 2, 2026

జయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ రాజర్షి షా

image

ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. వేడుకల ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.

News April 2, 2026

దివ్యాంగులకు ఊరట.. ఒకేచోట వైకల్య నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్

image

రిమ్స్‌లోని క్రిటికల్ కేర్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వైకల్య నిర్ధారణ పత్రాల కోసం గతంలో దివ్యాంగులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల వైద్య పరీక్షలు ఒకే చోట జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. నిపుణులైన వైద్య బృందం, ఆధునిక పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచామని, దీనివల్ల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు.

News April 2, 2026

ADB: ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కలెక్టర్

image

ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో లబ్ధిదారురాలు కడదారపు పద్మిని నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారురాలితో గృహ ప్రవేశం చేయించిన ఆయన, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.