India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిహార్‌లో నేటి నుంచి 30 తేదీ వరకు జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణ బాలికల జట్టుకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి జాబడే రితీక ఎంపికయ్యారు. జాతీయస్థాయి టోర్నీకి రితీక ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్ చీఫ్ గోడం నగేశ్, ఛైర్మన్ పాయల్ శంకర్, అధ్యక్షుడు రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్ హర్షం వ్యక్తం చేశారు.
భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలను RTC కార్గో ద్వారా భక్తుల ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వనున్నట్లు రీజినల్ మేనేజర్ సోలోమాన్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌లోని ఆర్ఎం కార్యాలయంలో రాములవారి తలంబ్రాల పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తులు కార్గో కౌంటర్లలో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రీజియన్ పరిధిలో దాదాపు 1000 మంది భక్తులు తలంబ్రాల కోసం బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రతిరోజు నేరం చేసే వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందనే నమ్మకం న్యాయస్థానం ద్వారా లభిస్తుందని ADB SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. 2022లో హత్య కేసులో ఒకరికి యావజీవ శిక్ష పడిందన్నారు. నేరస్తుడికి శిక్ష పడటంలో ప్రతిభ కనబరిచిన కోర్టు డ్యూటీ అధికారి, లైజన్ అధికారి, పీపీని అభినందించారు.
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పునిచ్చారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్‌కు చెందిన కొడిమెల ప్రభాకర్ పాత కక్షల కారణంగా కుట్ల రమేశ్‌ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటి జైనథ్ ఎస్ఐ పెర్సిస్, సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. 18 మంది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణలో నేరం రుజువైంది.
50% కంటే ఎక్కువ శాతం గిరిజనులు నివసిస్తున్న గ్రామాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని ఆదిలాబాద్ MP నగేశ్ కోరారు. బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల గిరిజనులకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు.
బాల్య వివాహాల నివారణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని DCPU సిబ్బంది ప్రేమ్ అన్నారు. బుధవారం పట్టణంలోని KRK కాలనీ మక్కా మసీద్‌లో షుర్ ఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, ఫీల్డ్ సుపర్వైజర్ కిరణ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఒక వ్యవస్త పని చేస్తుందన్నారు. ఆపదలో ఉన్నవారు ఎవరికి భయపడకుండా డయల్ 100, 181,1098కి కాల్ చేయాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,050 మంది విద్యార్థులకు గాను 10,026 మంది విద్యార్థులు హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలకు గాను 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారు.
కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. రేపు ఢిల్లీలో DCC అధ్యక్షులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ పోటీచేయడంతో మాజీ DCC అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డిలను సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. రేసులో ADB అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది, TPCC ప్రధానకార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ZPTC గణేశ్‌రెడ్డి తదితరులున్నట్లు సమాచారం.
BC విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ వాటాను డైరెక్ట్‌గా కళాశాలల ఖాతాలకు జమచేయనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు వారి బ్యాంకు అకౌంట్ డిటైల్స్, పాస్ బుక్ కాపీని బీసీ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ నెల 27లోపు ONLINEలో పొందుపరుచాలని, లెటర్ హెడ్ పైన అకౌంట్ డిటేల్స్‌తో పాటు స్టేట్ మెంట్ కాపీ జత చేయాలని సూచించారు.
తల్వార్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బంగారిగూడకు చెందకన సలీం ఖాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం వైరలైందన్నారు. ఇదివరకే సలీం ఖాన్ పలు ముఖ్యమైన కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.