India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంచిర్యాలలోని లక్ష్మీ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్‌కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ప్రతిభను కనబర్చారు. పట్టణంలోని జై జవాన్ నగర్ కాలానికి చెందిన సుంకరి నవీన్ ఆల్ ఇండియాలో 1833 ర్యాంక్ సాధించారు. 38.33 మార్కులు సాధించి క్వాలిఫై అయ్యాడు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో 15నెలల చిన్నారి మృతి చెందిన ఘటన దిలావర్‌పూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అబ్దుల్‌సాదిక్, అనయాకు 15నెలల కూతురు ఉంది. శనివారం గ్యాస్ ఏజెన్సీ వాహనం సిలిండర్ల పంపిణీకి వెళ్తుంది. ఈక్రమంలో చిన్నారి ఇంట్లో నుంచి బయటకి రావడంతో వేగంగా వస్తున్న వాహనం తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నట్లు SI తెలిపారు.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT

నిర్మల్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలో శనివారం తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా విధించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్ తెలిపారు. మూడు హోటల్లు, మూడు మిల్క్ సెంటర్లకు రూ. 92000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆహారాన్ని కల్తీ చేయవద్దని సూచించారు.

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు, వివిధ రకాల ప్రచార సామాగ్రిలు తొలగించాలని అన్నారు.

మంచిర్యాల పట్టణంలో ఇద్దరు ఆటో దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సున్నం బట్టివాడలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమాల శ్రీధర్, వెంగళ శ్యాం కుమార్ దొంగిలించిన ఆటోలను తీసుకొని వెళుతుండగా పట్టుబడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2ఆటో లను సీజ్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.

పేద,మధ్య తరగతి కుటుంబాల పిల్లల కోసం తెలంగాణలోని బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో వసతితో కూడిన ఉచిత బోధనకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుజ్యోతి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 12 వరకు టీజీఆర్డీసీ సెట్-2024 పేరిట ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
SHARE IT

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.