India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO కీర్తి తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణపై శనివారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 6,7,8తో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.
భద్రాచలంలో ఏప్రిల్ 6న నిర్వహించనున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి వెళ్ళని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సోలోమాన్ తెలిపారు. ఒక ప్యాకెట్‌కి రూ.151 చెల్లించి ఆఫ్‌లైన్‌లో గానీ, ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ తలంబ్రాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కార్గో కౌంటర్లు ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది
ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం గూడ రాంపూర్‌లో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా కత్తి పోట్లకు గురయ్యాడు. ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తాగిన మత్తులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.
గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
జైనథ్ మండలం అడ గ్రామానికి చెందిన దుర్ల అశోక్ కుమారుడు అవినాశ్ శుక్రవారం విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో ఎంపికయ్యారు. ఆయన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ఉద్యోగం సాధించారు. జిల్లాకేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటు ప్రిపేర్ అయినట్లు అవినాశ్ తెలిపారు. ఉద్యోగం సాధించడం పట్ల ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రమేశ్ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.