India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో టన్నెల్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45, KBR పార్కు కింద నుంచి 6.30 కిలోమీటర్ల మేర సొరంగాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇందుకు రూ. 3 వేల కోట్లు అవుతుందని ఓ ఏజెన్సీ జీహెచ్ఎంసీకి నివేదిక సమర్పించింది. దీనికి తోడు జూబ్లీహిల్స్ రోడ్ నం. 2లో భూసేకరణ కొంత కష్టమేనని అధికారులు చెబుతున్నారు. టన్నెల్ నిర్మాణంపై ముందుకు వెళుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్‌వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి పీఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు.
విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. RR జిల్లా నందిగామ మండల కేంద్రానికి చెందిన బన్నీ(18) ఇంట్లో ఉన్న నీటి సంపులో మోటార్ కు వైర్లు బిగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలాడు. అపస్మారక స్థితిలో ఉన్న బన్నీని కుటుంబీకులు షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు, మొహర్రం పండగ సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగును రప్పించనున్నారు. కర్ణాటక దావణగెరెలోని పాంచాచార్య మందిర ట్రస్టు నుంచి ఊరేగింపు కోసం తెలంగాణకు ఏనుగు(రూపవతి)ని తరలించేందుకు అక్కడి శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏనుగు కోసం మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. 2017లో 8 ఏళ్ల బాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానాను విధిస్తూ జడ్జి తీర్పును వెలువరించారు.
HYDలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్ చూడండి. SHARE IT
బల్దియా స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న షాహిన్ బేగం మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అర్హత పొందిన నామినేషన్ల వివరాలు 23న వెలువరిస్తారు. ఉపసంహరణ గడుపు 26వ తేదీ వరకు ఉంటుంది. ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
HYDలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు కొత్తగా జంతువులు వచ్చాయి. జంతు మార్పిడిలో భాగంగా UP కాన్పూర్ నుంచి రాయల్ బెంగాల్ పెద్దపులి(ఆడ)ని తీసుకొచ్చారు. మరో రెండు చిరుత పులుల జంటలు, జింకలు, కొన్ని పక్షులను ‘జూ’కు షిఫ్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కాన్పూర్‌కు కూడా పలు జంతువులను తరలించారు. కాగా, మంగళవారం నుంచి ఆదివారం(8:30AM-4PM) వరకు జూ తెరిచి ఉంటుంది. సోమవారం సెలవు.
SHARE IT
డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. లిబర్టీలోని ప్రధాన కార్యాలయంలోని మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వైద్యఆరోగ్యశాఖ ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రెగ్యూలర్‌గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్‌మెట్ నుంచి బెంగళూరు-హైదరాబాద్ NH-44కు అనుసంధానం చేస్తూ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో HMDA ప్లాన్ చేస్తోంది. మొత్తం 4 లైన్‌లు, 2.65 KM పొడవు, రెండు చోట్ల ఎంట్రీ ర్యాంపులు, ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.