Hyderabad

News June 5, 2024

మల్కాజిగిరి: కాంగ్రెస్ కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

image

అధికార కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. BJP చేతిలో పరాజయాన్ని చవిచూడడానికి అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి పోటీకి కాంగ్రెస్‌ సీనియర్లు KLRతో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పార్టీ నాయకులు అంటున్నారు.

News June 5, 2024

HYD: అంతా BRS.. అయినా BJP..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలోని దాదాపు అన్ని సీట్లలో BRS గెలిచినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం BJP గెలిచింది. BRS పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, బలమైన క్యాడర్ ఉన్నా సరే ప్రజలు BJP వైపే మొగ్గు చూపారు. కాగా BRS నేతలు, శ్రేణులు కూడా BJPకి ఓటేశారని.. BRS, BJP ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోపాయికారి ఒప్పందంతో అసెంబ్లీలో BRS, లోక్‌సభ ఎన్నికల్లో BJPని గెలిపించుకున్నారని చెబుతున్నారు.

News June 5, 2024

HYD: ప్చ్.. డిపాజిట్ కోల్పోయిన పద్మారావు

image

ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకొన్న పజ్జన్న‌ను MP ఎన్నికల్లో జనాలు ఆదరించలేదు. ఎన్నికల ముందు సికింద్రాబాద్‌లో BRS VS BJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ, నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. 1, 2 మినహాయిస్తే.. అన్ని రౌండ్లలో BRS మూడో స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,29,586(12.37%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. తొలిసారి MPగా పోటీ చేసిన MLA పద్మారావు ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

News June 5, 2024

మల్కాజిగిరి బ్యాలెట్‌లోనూ బీజేపీకి ఆధిక్యం

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 18,880 బ్యాలెట్ ఓట్లు ఉండగా.. ఇందులో 18,496 బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 10,330 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డికి 6,230 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 1,787 ఓట్లు వచ్చాయి. నోటాకు 160 ఓట్లు రాగా.. చెల్లని బ్యాలెట్ ఓట్లు 222 ఉన్నాయి.

News June 5, 2024

HYD: TDP గెలుపు.. BRS MLA సంతోషం

image

ప్రజలు ఇచ్చిన అవకాశంతో అహంకారాన్ని నెత్తిన ఎక్కించుకునే నాయకులకు ఏపీ ప్రజల తీర్పు చెంపపెట్టు లాంటిదని HYD రాజేంద్రనగర్ MLA, BRS నేత ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఏపీలో TDP, జనసేన, BJP కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు తిరుగులేని మెజారిటీతో విజయం అందించినా నియంతృత్వం, అహంకారం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకే ఆయన పరిమితమయ్యారని మండిపడ్డారు.

News June 5, 2024

అట్లుంటది MALKAJGIRI ప్రజలతోని..!

image

మల్కాజిగిరి ప్రజలు విలక్షణ తీర్పుకు పెట్టింది పేరుగా మారారు. గెలిపించిన పార్టీని వరుసగా మళ్లీ గెలిపించకుండా ప్రతిసారీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించగా ఆ తర్వాత 2014లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించారు. మళ్లీ 2019లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని గెలిపించగా ఈసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై మీ కామెంట్?

News June 5, 2024

రంగారెడ్డి: పట్నం, పట్లోళ్ల ఫ్యామిలీకి కలిసిరాని ఎంపీ ఎన్నికలు

image

ఉమ్మడి RR జిల్లా రాజకీయాలను శాసించిన పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీలకు ఎంపీ ఎన్నికల్లో మాత్రం గెలుపు వరించడం లేదు. తాజాగా పట్నం సునీతారెడ్డి ఓటమే ఇందుకు నిదర్శనం. HYD పార్లమెంట్ స్థానం నుంచి గతంలో TDP అభ్యర్థిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పోటీ చేసి ఓడారు. 2014లో కార్తీక్ రెడ్డి పోటీ చేసి కొండా చేతిలో ఓడారు. దీన్ని బట్టి పట్లోళ్ల, పట్నం ఫ్యామిలీల్లో ఎంపీ స్థానాలకు పోటీ చేయడం కలిసిరాలేదని తెలుస్తోంది.

News June 5, 2024

HYD: KTRదే ఓటమి బాధ్యత..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలో సత్తా చాటిన BRS..MP ఎన్నికల్లో మాత్రం మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు గురి చేసింది. కాగా HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి,చేవెళ్లలో BRSను గెలిపించేందుకు KTRను నమ్మి KCR బాధ్యతలు అప్పగించారు.అందుకు తగ్గట్లు KTRరోడ్ షోలు, సభలతో హోరెత్తించారు. అయినా ప్రజలు BRSకు నో చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ BRS థర్డ్ ప్లేస్‌లో ఉండడం గమనార్హం.

News June 5, 2024

HYD: ఈటలకు గోల్డెన్ ఛాన్స్..!

image

మల్కాజిగిరి ప్రజలు ఈటలకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మల్కాజిగిరి ప్రజలు ఎంపీగా గెలిపించారు. కాగా దేశంలో అతిపెద్ద ఎంపీ స్థానమైన ఇక్కడ 2009లో గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా, 2014లో గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా, 2019లో గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈటల కేంద్ర మంత్రి అవుతారా వేచి చూడాలి.

News June 5, 2024

HYD: ఓట్ల లెక్కింపు ప్రశాంతం: కమిషనర్

image

హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన కార్వాన్, నాంపల్లి, యాకుత్‌పుర, చార్మినార్, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ ప్రక్రియకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి, పోలీస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.