Hyderabad

News February 2, 2026

HYD: భార్య ఆత్మహత్య బెదిరింపు.. స్టూల్‌ తన్నేసిన భర్త!

image

క్షణికావేశం, మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య అరుణతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తనను బెదిరించేందుకు అరుణ స్టూల్‌పై ఎక్కి ఉరి వేసుకోబోగా, ఆగ్రహంతో ఉన్న కొండల్ స్టూల్‌ను కాలితో తన్నేశాడు. దీంతో ఆమె ఊపిరాడక ప్రాణాలు విడిచింది. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News February 2, 2026

HYD: వంటరితనమే ఆ కుటుంబాన్ని కబళించిందా..?

image

చర్లపల్లి వద్ద రైలుకింద పడి <<19011053>>తల్లి, పిల్లలు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. భర్త సురేందర్‌ ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉండగా మృతురాలు విజయ IT కంపెనీలో టీమ్‌లీడర్‌. పిల్లలు హాస్టల్‌‌లో ఉంటున్నారు. ఒంటరితనం పీడిస్తోందని బందువులతో చెప్పి, సూసైడ్‌ నోట్‌‌ రాసి తన కారులో పెట్టి, వాట్సప్‌ స్టేటస్‌గా కూడా సూసైడ్ లెటర్ పెట్టినట్లు సమాచారం. సూసైడ్‌కు కారణం ఒంటరితనమా, మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

News February 2, 2026

హుస్సేన్‌సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం

image

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం ఆదివారం లభ్యమైంది. నీటిపై తేలుతున్న మృతదేహాన్ని గుర్తించిన లేక్ పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

News February 1, 2026

బడ్జెట్: HYD అభివృద్ధికి కొత్త ఊపిరి

image

నేడు పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ HYD అభివృద్ధికి కొత్త ఊపిరి పోసింది. ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కింద ప్రకటించిన రూ.1 లక్ష కోట్ల గ్రాంట్‌లో HYD మెట్రో ఫేజ్-2 (Phase IIA & IIB) విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. RRR దక్షిణ భాగానికి లైన్ క్లియర్ చేయడంతో పాటు, రూ.40వేల కోట్లు సెమీకండక్టర్ మిషన్ 2.0లో నగరానికి పెద్దపీట వేశారు. ‘బయోఫార్మా శక్తి’ కింద రూ.10వేల కోట్లు కేటాయించారు.

News February 1, 2026

HYD: నగరవాసుల ‘చూపంతా ఆ మంత్రిపైనే’

image

2026 BUDGETపై HYD గంపెడాశలు పెట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే రూ.44000CR అంచనాతో మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది. అలాగే RRR దక్షిణ భాగానికి జాతీయ హోదా, రూ.34,367CR నిధుల కోసం చూస్తోంది. నిన్నే GHMC నగరాభివృద్ధికి రూ.11,460CR భారీ బడ్జెట్‌ను ఆమోదించింది. మూసీ పునరుజ్జీవం, ఎయిర్పోర్టులు , సెమీకండక్టర్ మిషన్‌లో భాగస్వామ్యంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేస్తుందోనని నగరం ఆసక్తిగా చూస్తోంది.

News February 1, 2026

సిట్ విచారణకు KCR.. సిటీలో BRS ప్లాన్ ఇదే?

image

నేడు KCR సిట్ విచారణ నేపథ్యంలో నగరంలో BRS నేతలు భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న KCR ఉదయం 11 గంటలకు నందినగర్‌లోని నివాసానికి రానున్నారు. అయితే, KCR మీద కక్ష పూరితంగా ప్రభుత్వం విచారణకు పిలుస్తోందని BRS నేతలు ఇప్పటికే ఖండించారు. అన్ని ఏరియాల్లో నిరసన తెలపాలని మరోవైపు KTR పిలుపునిచ్చారు. సిటీలో BRS నేతలు బల ప్రదర్శన చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.