Hyderabad

News February 1, 2026

NIMSలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

image

గంజాయి స్మగ్లర్ల‌ హిట్ అండ్ రన్‌లో తీవ్రంగా గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది. ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప సాయంత్రం తెలిపారు. ICUలో వెంటిలేటర్, డయాలసిస్ వంటి అధునాతన లైఫ్ సపోర్ట్‌ మీద ఉంచినా ఆమె ప్రాణాలు దక్కలేదు. అవయవాల పనితీరు దెబ్బతినడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. రాత్రి 9:41 నిముషాలకు తుది శ్వాస విడిచినట్లు NIMS ప్రకటన విడుదల చేసింది.

News January 31, 2026

సికింద్రాబాద్‌లో ‘దొంగ’ ప్లాన్ వేశాడు.. పోలీసులకు దొరికాడు!

image

నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ATM మెషిన్‌లో డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్టైన సంఘటన మహంకాళి PS పరిధిలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన షేక్ మోసిన్ రెజిమెంటల్‌బజార్‌లోని ఓ లాడ్జిలో ఉంటూ నకిలీ కలర్ జిరాక్స్ నోట్లను ప్రింట్ చేసి ఏటీఎం మిషన్‌లో డిపాజిట్ చేసాడు. అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కావడం లేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసలు విషయం బయటపడడంతో షేక్ మోసిన్‌ను అరెస్ట్ చేశారు.

News January 31, 2026

HYD: నైట్ 10 దాటితే అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే?

image

రాత్రి 10 దాటాక హైదరాబాద్ మ్యాప్ మారిపోతుంది. అమీర్‌పేటలోని నర్సులు, రాయదుర్గం ఐటీ సపోర్ట్ టీమ్స్ అంతా షేర్డ్ క్యాబ్‌లలో ఇళ్లకు వెళ్తుంటారు. అఫీషియల్ డ్యాష్ బోర్డుల కంటే అమ్మాయిల లైవ్ లొకేషన్ షేర్లు, గ్రూప్ చాట్‌లలో వచ్చే అలర్ట్ లే వారికి అసలైన భద్రత. సెక్యూరిటీ గార్డులు, క్యాబ్ డ్రైవర్లు ఈ నిశ్శబ్ద ప్రయాణంలో తోడుగా నిలుస్తారు. ఇదొక అదృశ్య భద్రతా వలయం.

News January 31, 2026

HYD: నెల రోజులు టైమ్ ఇచ్చారు.. ఇక చూస్కోండి!

image

ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపుల సీజ్ చేసే కార్యక్రమానికి నెల రోజులు హైడ్రా విరామం ఇచ్చింది. ఈమేరకు షాపుల యజమానులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ శనివారం సమావేశం అయ్యారు. ఈ నెల రోజుల గడువులో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా షాపుల వారు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆదేశించారు. నెల తర్వాత తనిఖీలు ముమ్మరం చేసి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

News January 31, 2026

GHMC: విలీనం-విస్తరణ వెనుక సవాళ్లు

image

HYDలో 12 జోన్లు, 60 సర్కిళ్లుగా విస్తరించడం అభివృద్ధికి సంకేతమే అయినా క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎన్నో ఉన్నాయి. 2025 ఆర్డినెన్స్ ద్వారా జరిగిన ఈ భారీ విలీనం వల్ల పాత, కొత్త ప్రాంతాల మధ్య సమన్వయం కుదరాలి. కొత్తగా చేరిన ఏరియాల్లో మౌలిక వసతుల కల్పనపైనే బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. విస్తరణపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెడితేనే ఈ మెగా సిటీ ప్లాన్ సక్సెస్ అవుతుందని <<19013695>>పొలిటికల్ లీడర్లు<<>> అభిప్రాయం తెలియజేశారు.

News January 31, 2026

HYD: ఏం బాధొచ్చిందో ఈ తల్లికి!

image

తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పటాన్‌చెరు‌లోని హాస్టల్‌లో ఉన్న తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి మరీ విజయశాంతి సూసైడ్ చేసుకున్నారు. ప్లాట్‌ఫారం మీద నడుస్తున్న ఫొటోలో కొడుకు వద్దు అమ్మ అన్నట్లు సంకేతం కనిపిస్తోంది. కాగా, విజయశాంతి భర్తకు సౌదీలో ఉద్యోగం. పిల్లలు బాగా చదువుతారు. ఏ కష్టాలు లేని బిడ్డ ఎందుకు ఇలా చేసిందో? అని మృతురాలి <<19011053>>తల్లి కన్నీరు<<>> పెట్టుకుంది.

News January 31, 2026

HYD: మొబైల్ మాయలో.. మరుగునపడుతున్న చందమామ కథలు!

image

నేటి డిజిటల్ యుగంలో చిన్నారులు స్మార్ట్‌ఫోన్లకు బానిసలై ప్రాచీన సాహిత్యానికి దూరమవుతున్నారు. నైతిక విలువలు పంచిన చందమామ, బాలమిత్ర కథలు నేడు కనుమరుగవుతున్నాయి. మితిమీరిన మొబైల్ వాడకంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, పఠనాసక్తి క్షీణిస్తున్నాయని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్కారవంతమైన సమాజం కోసం పిల్లలను పుస్తక పఠనం వైపు మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హితవు పలుకుతున్నారు.

News January 31, 2026

HYD: బాలికపై అత్యాచారం.. 25 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ హబీబ్ (53) 2023లో బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో 25 సంవత్సరాలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.

News January 31, 2026

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

image

సికింద్రాబాద్‌ మహంకాళి పీఎస్ పరిధి కళాసిగూడలో ఓ పాత భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గదిలోని వస్తువులు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న ప్రైవేట్ పాఠశాలకు ముప్పు తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

News January 31, 2026

HYD: GOOD NEWS.. రూ.5 వేల బహుమతి

image

రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడంలో భయపడవద్దని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి వెంటనే సహాయం చేస్తే ‘గుడ్ సమారిటన్’ కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.5,000 నగదు బహుమతి, పూర్తిగా చట్ట పరమైన రక్షణ ఉంటుందన్నారు. ఎలాంటి పోలీస్ కేసులు లేదా న్యాయ సమస్యలు ఉండవన్నారు. క్షతగాత్రులను ముందుగా సమీప ఆసుపత్రికి తరలించి, సాయం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు.