India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చెంగిచర్లలో వరుస చోరీలతో ప్రజలకు కునుకు లేకుండా చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లిన సందర్భాన్ని అవకాశంగా తీసుకుని 8 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన నిందితులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు కాసేపట్లో మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉప్పల్ డీసీపీ, మల్కాజిగిరి క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

ఏదైనా వాణిజ్య సముదాయం, భవనం, దుకాణం, షోరూమ్స్ ఫైర్ సేఫ్టీ లేనట్లు గమనించినా, నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించినా తక్షణం హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667, 7207923085 నంబర్లలో సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపించాలని, ‘Commissioner& HYDRAA’ హ్యాష్ ట్యాగ్‌తో Xలో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ కోరారు.

జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన ముగిసిపోనున్న తరుణంలో దాదాపు రూ.3,405 కోట్ల పనులకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 53 అంశాలను అజెండాలో చేర్చగా ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం అద్దె తగ్గింపు వ్యవహారం తప్ప మిగతావాటిని ఆమోదించింది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్, సభ్యులు తదితరులు ఉన్నారు.

హైదరాబాద్‌లో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. గాలి నాణ్యత విషయంలో HYD తాజాగా బెంగళూరు, చెన్నై నగరాలను దాటినట్లు కాలుష్య నియంత్రణ మండలి (PCB) వెల్లడించింది. మెట్రో నగరాల కాలుష్య గణాంకాల్లో హైదరాబాద్ ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. గతంలో నగరంలో 7 కాలుష్య హాట్‌స్పాట్లు ఉన్నాయని, ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారుతోందని అధికారులు తెలిపారు. కాగా ఇవాళ గాజులరామారంలో ఉదయం AQ 394గా నమోదైంది.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఎయిర్ షోకు జనాలు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని HYD ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఉ.7 నుంచి రాత్రి 8 వరకు పంజాగుట్ట- గ్రీన్‌ల్యాండ్స్- బేగంపేట ఎయిర్‌పోర్ట్ రూట్లో భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందన్నారు. PNT ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీవో జంక్షన్ల వద్ద రద్దీకి తగ్గట్లు మళ్లింపులుంటాయన్నారు. సందర్శకులకు పార్కింగ్ ఏర్పాటు చేశారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన GHMCలో క్రమశిక్షణ గల కంటోన్మెంట్‌ను కలపడమంటే ఆత్మహత్యాసదృశ్యమేనని BJP నాయకులు మండిపడుతున్నారు. “సొంత స్టాఫ్‌కు జీతాలివ్వలేని, ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన GHMCతో మాకేం పని?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మేయర్‌ను పప్పెట్‌గా మార్చి కౌన్సిల్ భేటీలే నిర్వహించని అస్తవ్యస్త వ్యవస్థలోకి కంటోన్మెంట్‌ను నెట్టొద్దని BJP నాయకత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై హైదరాబాదీ కామెంట్?

తెలంగాణ పర్యాటక మణిహారంలో మరో మెరిసే రత్నం చేరబోతోంది. భాగ్యనగరవాసుల వీకెండ్ డెస్టినేషన్ శామీర్‌పేట జింకల పార్కును రూ.1.15 కోట్లతో సర్కారు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వందకు పైగా చుక్కల జింకలు, రాజసం ఒలికించే కృష్ణజింకల గంతులతో ఈ అడవి పులకించనుంది. కాంక్రీట్ జంగిల్‌లో అలసిపోయిన మనసులకు ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలిని, ఆహ్లాదాన్ని అందించే ఈ ప్రాజెక్టు పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తుంది.

గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు TGHB 3 ప్రాంతాల్లో 111 LIG ఫ్లాట్లకు జనవరి 6న లాటరీ తీశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్షగా నిర్ణయించగా, మొత్తం 2,663 అప్లికేషన్‌లు వచ్చాయి. ఫ్లాట్ రాని వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే 22 రోజులు గడిచినా ఇప్పటికీ పైకం రాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తాము చెల్లించిన పైకం రిఫండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున టీచర్స కాలనీలో 236గా ఉంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 15 రోజులతో పోలిస్తే ఇవాళ ఒక్కసారిగా గాలి నాణ్యత క్షిణించింది.

అత్యవసర సమయాల్లో ఏ సమస్యకు ఏ నంబర్లకు కాల్ చేయాలో మీ కోసం..
☞ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ☞ 102 గర్భిణులు& పిల్లల కోసం ☞ 1073 సిటీలో రోడ్డు ప్రమాదాలు జరిగితే ☞1912 విద్యుత్‌శాఖ ☞1098 చైల్డ్ లేబర్ ☞ 104 హెల్త్ అడ్వైజ్ తీసుకోవడానికి ☞14567 సీనియర్ సిటిజన్స్ సహాయార్థం ☞ 1098 చైల్డ్ లేబర్ ☞ 1033 నేషనల్ హైవేలపై ఎమర్జెన్సీ ఏర్పడితే ర్యాపిడ్ రెస్పాన్స్ ☞ 9440700906 షీ టీమ్స్ ☞ 9000113667 హైడ్రా
# SHARE IT
Sorry, no posts matched your criteria.