India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర వ్యాప్తంగా మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. మరీ గణతంత్రం అంటే అర్థం తెలుసా? ‘గణతంత్రం’ అనేది ప్రజలకు అధికారం కలిగిన పాలనా విధానం. ఇందులో దేశాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎన్నుకుంటారు. రాజు లేదా వారసత్వ పాలకుడు ఉండరు. తమను తాము పరిపాలించుకుంటామని ఓటు హక్కుతో ప్రతినిధులను ఎన్నుకుని దేశ పాలనను నిర్వహింపజేస్తారు.
*నేడు 77వ గణతంత్ర దినోత్సవం

HYD లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్స్‌లో ‘కిలో బుక్ ఫెయిర్’ సందడి మొదలైంది. MRP రేట్లతో పనిలేకుండా, కూరగాయలు కొన్నట్లుగా పుస్తకాలను కిలోల లెక్కన సొంతం చేసుకోవచ్చు. UK, USA నుంచి వచ్చిన పది లక్షల పైచిలుకు పుస్తకాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. 5 కేజీల బాక్స్ తీసుకుంటే కిలో ₹399 మాత్రమే! పిల్లల కథల పుస్తకాల నుంచి ఫిక్షన్, నాన్-ఫిక్షన్ వరకు అన్నీ దొరుకుతాయి. ఇవాళ జరిగే ఈ వేడుకను మిస్ కాకండి!

గచ్చిబౌలిలో ప్రిజం పబ్ వద్ద నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి సాహసం చేశారు. నిందితుడి కాల్పుల్లో కాలికి గాయమైనప్పటికీ, తగ్గకుండా ప్రాణాలకు తెగించి అతడిని బంధించారు. ఈ అసాధారణ ధైర్యసాహసానికి వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

వాహనాలపై అనధికారికంగా ప్రెస్, అడ్వకేట్, ప్రభుత్వ చిహ్నాలు, HRC స్టిక్కర్లు వాడటంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. సమాచార పౌర సంబంధాల శాఖ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే ‘PRESS’అని రాసుకోవాలని, అదీ నంబర్ ప్లేట్లపై ఉండకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది.

నగరంలోని చెరువులు, నాలాల పరిరక్షణకు ప్రభుత్వం సరికొత్త TDR పాలసీని తీసుకొచ్చింది. ఇకపై నాలా వెడల్పు కోసం ప్రైవేటు భూములిస్తే రోడ్డు విస్తరణతో సమానంగా 400% TDR ఇస్తారు. అలాగే చెరువుల బఫర్ జోన్లలో స్థలాలు వదులుకునేవారికి 300% TDR లభిస్తుంది. ఒకవేళ ఆ స్థలం చెరువు అభివృద్ధి పనులకు అవసరమైతే ఏకంగా 400% వరకు బెనిఫిట్స్ కల్పిస్తారు. సెట్‌బ్యాక్ నిబంధనల్లో కూడా సడలింపులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

TDR సర్టిఫికేట్ల జారీ, అమ్మకం, వినియోగంలో ఎలాంటి మోసాలకు తావులేకుండా GHMC ‘ఆన్‌లైన్ TDR బ్యాంక్’ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి సర్టిఫికేట్ ఆధార్‌తో లింక్ అయి ఉంటుంది. యజమాని ఫోన్‌కు వచ్చే OTP ద్వారానే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి థర్డ్ పార్టీ డిస్టర్బ్ పెట్టే ఛాన్స్ లేదు. ఎవరికైనా టీడీఆర్ కావాలన్నా లేదా అమ్మాలన్నా ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో నోటిఫికేషన్ ద్వారా తమ అవసరాలను తెలియజేయవచ్చు. SHARE IT.

టీడీఆర్ సర్టిఫికేట్లను మునుపు కేవలం ఓఆర్ఆర్(ORR) లోపల మాత్రమే వాడేవారు. కానీ, 2022లో వచ్చిన సవరణల ప్రకారం, GHMC ఇచ్చే టీడీఆర్ కార్డులను ఇప్పుడు పూర్తి HMDA ఏరియాలో ఎక్కడైనా వాడుకోవచ్చు. అంతేకాకుండా అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకునేందుకు (455A సెక్షన్ కింద) 33% కాంపౌండింగ్ ఫీజు బదులు సమాన విలువైన టీడీఆర్‌ను వాడుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.

తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,380 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభమైన దరఖాస్తులకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. SHARE IT.

Sorry, no posts matched your criteria.