Hyderabad

News January 26, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

image

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.

News January 26, 2026

గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

image

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.

News January 26, 2026

నాంపల్లి: రోజుకు 44వేల మంది సందడి చేస్తున్నారు

image

నుమాయిష్.. నగరవాసులు సరదాగా గడిపే ప్రాంతం. ఏటా JAN, FEB నెలల్లో నాంపల్లిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఈ సంవత్సరం లక్షల మంది సందర్శిస్తున్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు (25వ తేదీ వరకు) 11లక్షల మంది నుమాయిష్‌లో సందడి చేశారు. అంటే రోజుకు సరాసరి 44వేల మంది వస్తున్నట్లు. FEB 15 వరకు నగరవాసులకు ఈ వినోదం అందుబుటోల ఉంటుంది. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు.

News January 26, 2026

హైదరాబాద్: 24 ఏళ్ల తర్వాత చారిత్రక దృశ్యం

image

హైదరాబాద్ చారిత్రక కోత్వాల్ హౌస్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కాగా, 2002 తర్వాత తొలిసారిగా నగర పోలీస్ కమిషనర్ కోత్వాల్ హౌస్‌లో జాతీయ జెండాను ఎగురవేయడం విశేషం. ఈ కార్యక్రమం నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది.

News January 26, 2026

అక్రిడిటేషన్ కార్డుల జారీ.. GOలో కీలక సవరణలు

image

అక్రిడిటేషన్ కార్డుల జారీపై ఉన్న జీవో 252లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జీవో ఆర్టీ నంబర్ 103 ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33 శాతం తప్పనిసరి చేసింది. మీడియా కార్డు బదులు అక్రిడిటేషన్ పేరుతోనే కార్డు జారీ చేయనుంది. సర్క్యులేషన్ ఆధారంగా అదనపు అక్రిడిటేషన్‌లకు అవకాశం కల్పించడంతో పాటు, వివిధ విభాగాల్లో పనిచేసేవారికి కార్డులు రానున్నాయి.

News January 26, 2026

HYD: అమ్మాయిలూ.. ఈ NUMBER SAVE చేసుకోండి

image

మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా..? మౌనంగా భరించకండి. మీకు పోలీసులు అండగా ఉన్నారని చెబుతున్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆడపిల్లలను ఎవరు వేధించినా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. నిందితులకు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని, బాధితుల వివరాలు సీక్రెట్‌గా ఉంచుతామని తెలిపారు. 9490616555 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా, 100కు డయల్ చేసినా క్విక్ రెస్పాన్స్ ఉంటుందంటున్నారు. SHARE IT.

News January 26, 2026

HYD: డక్కన్‌ను ఏలిన ధీరవనిత

image

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.

News January 26, 2026

HYD: డక్కన్‌ను ఏలిన ధీరవనిత

image

<<18954194>>రుద్రమదేవి..<<>>దక్షిణ భారత సింహాసనాన్ని అధిరోహించిన తొలి ధీరవనిత. కాకతీయ వంశంలో కాంతులు చిందించిన మహారాణి. దేవగిరి రాజు మహాదేవుడి దండయాత్రలను ధైర్యసాహసాలతో తిప్పికొట్టిన ధైర్యశాలి. నాయంకర వ్యవస్థను అమలు చేసి చరిత్రలో నిలిచారు. గొలుసుకట్టు చెరువులకు ఆజ్యం పోసి నీటిని ఒడిసిపట్టేలా చేశారు. ఓరుగల్లు కోటకు మెరుగులద్దారు. 8పదుల వయసులో కదన రంగంలోకి దిగి కాయస్త అంబదేవుడితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు.

News January 26, 2026

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మేయర్ ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి పలువురు వికలాంగులకు పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News January 26, 2026

మువ్వన్నెల శోభతో బల్కంపేట ఎల్లమ్మ

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ గర్భగుడిని తీవర్ణపతాక రంగులతో అలకరించారు. వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఈ అపూర్వ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.