Hyderabad

News January 28, 2026

HYDలో కనెక్షన్లు కట్ చేస్తున్నారు.. అనుమతి తీసుకోండి!

image

జలమండలి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న 4 సీవరేజ్ కనెక్షన్‌లను అధికారులు తొలగించారు. మరో 4 భవన యజమానులకు నోటీసులు అందించారు. అక్రమంగా నల్లా, సీవరేజ్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్లు వాటిని క్రమబద్ధీకరించుకోవాలని MD అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.

News January 28, 2026

HYDలో కనెక్షన్లు కట్ చేస్తున్నారు.. అనుమతి తీసుకోండి!

image

జలమండలి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న 4 సీవరేజ్ కనెక్షన్‌లను అధికారులు తొలగించారు. మరో 4 భవన యజమానులకు నోటీసులు అందించారు. అక్రమంగా నల్లా, సీవరేజ్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్లు వాటిని క్రమబద్ధీకరించుకోవాలని MD అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.

News January 28, 2026

మేడారం జాతర ‘LIVE’.. ఫోన్లోనే తల్లుల దర్శనం

image

మేడారంలో జరిగే ప్రధాన ఘట్టాలను Way2News పాఠకులకు లైవ్ అప్‌డేట్స్ అందించనుంది. సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల పైకి చేరే అద్భుత ఘట్టాలను మీ చేతిలో ఉన్న ఫోన్లోనే వీక్షించవచ్చు. 24/7 లైవ్ కవరేజ్, ట్రాఫిక్ అప్‌డేట్స్‌, బెస్ట్ రూట్ మ్యాప్స్, గద్దెలు-బస్టాండ్ల వద్ద పరిస్థితి తెలుసుకోవచ్చు.

News January 27, 2026

JBS TO మేడారం.. DAY/NIGHT బస్సులు

image

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే నగరవాసులకు శుభవార్త. సికింద్రాబాద్ JBS నుంచి వన జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మేనేజర్ ఎల్.రవీందర్ తెలిపారు. రేపటి నుంచి జనవరి 31 వరకు 24 గంటల పాటు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాట్‌ఫాం నంబర్ 13 వద్ద బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని జంట నగరాల ప్రయాణికులు గమనించి, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

News January 27, 2026

HYDలో JAN 30న ఈ షాపులు బంద్

image

మహాత్మా గాంధీ వర్ధంతి(JAN 30)ని పురస్కరించుకొని నగరంలోని బీఫ్, గొర్రెలు, మేకల కబేళాలు, మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశించింది. స్టాండింగ్ కమిటీ తీర్మానం ప్రకారం GHMC చట్టం 1955లోని సెక్షన్ 533 (b) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధికారులు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని, మాంసం దుకాణాల యజమానులు, ప్రజలు సహకరించాలని GHMC విజ్ఞప్తి చేసింది.
SHARE IT

News January 27, 2026

TDR లెక్కలు–గణాంకాలు ఇలా ఉన్నాయి!

image

ప్రస్తుతం సిటీలో TDR లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,585 TDR సర్టిఫికేట్లను జారీ చేశారు. వీటి ద్వారా సుమారు 1,070 ఎకరాల భూమి TDR రూపంలో నమోదైంది. అందులో 712 ఎకరాలను ఇప్పటికే వివిధ నిర్మాణాల కోసం వాడేశారు. ప్రస్తుతం మార్కెట్లో మరో 316 ఎకరాల వరకు TDR నిల్వలు అందుబాటులో ఉన్నాయి. చెరువుల FTL భూములకు సంబంధించి TDR ఇచ్చే ముందు ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల నుంచి క్లియరెన్స్ తప్పనిసరి.

News January 27, 2026

HYD: మన్యం అగ్నికణం.. అల్లూరి సీతారామరాజు

image

సాయుధ పోరాటమే స్వాతంత్ర్యానికి మార్గమని విశ్వసించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. యుద్ధ విద్యలో ఆరితేరిన అల్లూరి ఆంగ్లేయుల అరాచకాలపై ఆయుధాలు ఎక్కుపెట్టారు. మన్యం గిరిజనుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా గర్జించారు. మహిళల అవమానాలపై తెల్లదొరల అరాచకానికి ఎదిరించి తిరగబడ్డారు. గెరిల్లా దాడులతో పోలీస్‌స్టేషన్లపై పిడుగులా విరుచుకుపడ్డారు. ప్రజల కోసం లొంగిన అల్లూరిని ఆంగ్లేయులు అతి కిరాతకంగా హతమార్చారు.

News January 27, 2026

HYDలో బస్సుల కొరత.. ప్రయాణికుల ఇక్కట్లు..!

image

మేడారం జాతర ప్రభావం భాగ్యనగర రవాణా వ్యవస్థపై పడింది. సమ్మక్క-సారలమ్మ మహాజాతర కోసం గ్రేటర్ పరిధిలోని సుమారు 50 శాతం సిటీ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా మళ్లించడంతో నగరంలో రద్దీ పెరిగింది. కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్లే వారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News January 27, 2026

HYD: కలల ఇల్లు చూసుకొని వస్తుండగా.. అంతులేని విషాదం

image

అభం శుభం తెలియని చిన్నారిని కూకట్‌పల్లిలో విధి వెంటాడింది. ఇంటికెళ్ళాల్సిన 2 ‘U TURN’లు దాటించి 3వ U TURN వద్ద మృత్యు పాశం మాంజా రూపంలో ఆ కుటుంబంలో <<18967621>>తీరని శోకాన్ని<<>> మిగిల్చింది. పటాన్‌చెరులో కొత్త ఇల్లు చూసుకొని తిరిగి వివేకానందనగర్ వస్తుండగా నగల దుకాణంలోకి వెళ్దాం అనుకుని ఆగితే.. ముందు కూర్చున్న 5ఏళ్ల నిష్విక ఏంజరుగుతుందో తెలియకుండానే తల్లిదండ్రుల ముందే ప్రాణాలు విడిచింది.

News January 27, 2026

HYD: ‘వాడి టార్గెట్ GYM చేసే యువకులే’

image

జిం చేసే యువతకు అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మొహమ్మద్ ఫైజల్ ఖాన్‌ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సూరత్ నుంచి వీటిని తెప్పించి ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్తాపూర్ పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. అతడి నుంచి భారీగా ఇంజెక్షన్లు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్లు వాడితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు.